SEL Manufacturing Company: కోవిడ్-19 సెకండ్ వేవ్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో పరిగెడుతున్న సమయంలో ఈ ఏడాదిలో బ్రేక్ పడింది. ఈ కొత్త ఏడాదిలో కరోనా ఓమిక్రాన్ వేరియంట్ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీల షేర్లు పడిపోతన్న సమయంలో చిన్న కంపెనీల స్టాక్ ధరలు మాత్రం భారీగా దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపరులకు గతంలో ఎన్నడూ లేని రీతిలో లాభాలు వస్తున్నాయి. ఒక మల్టీబ్యాగర్ స్టాక్ కంపెనీ మాత్రం కళ్లు చెదిరే లాభాలను మదుపరులకు తెచ్చి పెడుతుంది.
గత 3 నెలల కాలంలోనే ఈ ఎస్‌ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ షేర్ ధర ఊహించని స్థాయికి దూసుకెళ్లింది. ఈ కంపెనీ స్టాక్స్ కొన్న వారి పంట పడుతుంది. గత 3 నెలల్లో ఈ పెన్నీ స్టాక్ రూ.0.35 (ఎన్ఎస్ఈ 27 అక్టోబర్ 2021న) నుంచి రూ.87.45 (ఎన్ఎస్ఈ 21 జనవరి 2022న) వరకు పెరిగింది. ఈ స్వల్ప వ్యవధిలో కంపెనీ షేర్ ధర దాదాపు 24,900 శాతం లాభం అందించింది. అంటే, ఒక పెట్టుబడిదారుడు 3 నెలల క్రితం అక్టోబర్ 27న ఈ పెన్నీ స్టాక్‌లో రూ.1 లక్షను ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు ఆ స్టాక్ విలువ రూ. 2.50 కోట్లుగా ఉండేది.
ఎస్‌ఈఎల్ మాన్యుఫ్యాక్చరింగ్ అనేది ఒక టెక్స్‌టైల్ కంపెనీ. అయితే, చాలా మందికి స్టాక్ మార్కెట్ అంటే ఒక అపోహ ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోతారు అని నమ్మకం!. కానీ, నిపుణులు మాత్రం పెట్టుబడులను చిన్న, చిన్న మొత్తాలతో ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు మార్కెట్ పరిశోదన చేసి పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. ఎవరైతే, మార్కెట్ ని నిత్యం గమనిస్తూ పెట్టుబడులు పెడతారో వారికి మాత్రమే అధిక లాభాలు వస్తాయని పేర్కొంటున్నారు.
(చదవండి: లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!)
Comments
Please login to add a commentAdd a comment