విదేశీ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. ప్రస్తుతం 205 పాయింట్లు జంప్‌చేసి 38,640కు చేరింది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,441 వద్ద ట్రేడవుతోంది. వారాంతాన యూఎస్ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్ సరికొత్త గరిష్టాల వద్ద నిలవగా.. ఆసియాలోనూ ప్రస్తుతం సానుకూల ట్రెండ్ నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లకు హుషారొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.
ఐటీ మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ఐటీ మాత్రమే 0.5 శాతం బలహీనపడింది. బ్యాంక్ నిఫ్టీ, ఆటో, రియల్టీ, మీడియా, మెటల్, ఎఫ్‌ఎంసీజీ 1-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో షేర్ల విభజన చేపట్టిన ఐషర్ మోటార్స్ 8 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో కొటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, గ్రాసిమ్, జీ, యూపీఎల్, ఇండస్‌ఇండ్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్, ఐసీఐసీఐ, టాటా స్టీల్ 2.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హీరో మోటో, టైటన్, పవర్‌గ్రిడ్ 1.2-0.4 శాతం మధ్య నీరసించాయి.
డెరివేటివ్స్ తీరిలా
ఎఫ్‌అండ్‌వో కౌంటర్లలో జీఎంఆర్, అదానీ ఎంటర్, జిందాల్ స్టీల్, ఐబీ హౌసింగ్, సెయిల్, భెల్, ఐజీఎల్, జూబిలెంట్ ఫుడ్, ఐడియా, బెర్జర్ పెయింట్స్ 4.3-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క అశోక్ లేలాండ్, సన్ టీవీ, గ్లెన్‌మార్క్, లుపిన్, వేదాంతా, టీవీఎస్ మోటార్ 1.4-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.7-1 శాతం మధ్య పెరిగాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1402 లాభపడగా.. 525 నష్టాలతో కదులుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment