లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..! | Sensex Ends 143 pts Higher; Nifty Above 17800 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్..!

Published Fri, Jan 7 2022 4:07 PM | Last Updated on Fri, Jan 7 2022 4:07 PM

Sensex Ends 143 pts Higher; Nifty Above 17800 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా లాభపడుతూ పాయింట్లు పెరుగుతూ పోయింది. ట్రేడింగ్‌ మొదలైన గంటకే దాదాపు 400కు పైగా పాయింట్లు లాభపడి 60 వేలు క్రాస్‌ చేసి ఈ రోజు గరిష్టం 60,130 పాయింట్లను టచ్‌ చేసింది. దీంతో వెంటనే ఇన్వెస్టర్లు తక్షణ లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించడంతో వేగంగా పాయింట్లూ కోల్పోవడం ప్రారంభించింది. ఆ తర్వాత సూచీలు ఊగిసలాట దొరణి కనబరిచాయి. ఆసియా మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులున్నా.. దేశీయ స్టాక్​ మార్కెట్లు వారాంతంలో లాభాలు నమోదుచేశాయి. 

చివరకు, సెన్సెక్స్ 142.81 పాయింట్లు (0.24%) లాభపడి 59,744.65 వద్ద ఉంటే, నిఫ్టీ 66.80 పాయింట్లు (0.38%) పెరిగి 17,812.70 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.30 వద్ద ఉంది. నిఫ్టీలో గ్రాసిమ్​ ఇండస్ట్రీస్​, ఓఎన్​జీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్స్​, బ్రిటానియా, హెచ్​డీఎఫ్​సీ లైఫ్​ షేర్లు​ రాణిస్తే.. బజాజ్​ ఫిన్​సర్వ్​, బజాజ్​ ఫినాన్స్​, ఎం అండ్​ ఎం, ఎల్​ అండ్​ టీ, భారతీ ఎయిర్​టెల్, హెచ్​డీఎఫ్​సీ​ షేర్లు డీలాపడ్డాయి. సెక్టోరల్ ఫ్రంట్‌లో బ్యాంక్, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్ సూచీలు 0.5-1 శాతం పెరిగాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్లలో అమ్మకాలు కనిపించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు లాభాల్లో ముగిశాయి.

(చదవండి: ప్రత్యర్ధికి ఇచ్చి పడేశాడు, ఎలన్‌ మస్క్‌ అంటే కథ వేరుంటది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement