దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త రికార్డ్‌లను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం యూఎస్ మార్కెట్‌ల నుండి సానుకూల సంకేతాలతో నిపుణులు అంచనాల కంటే మెరుగ్గా ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా ఎక్కువ శాతం సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అందరి చూపు ఫిబ్రవరి ఆటోమొబైల్ సేల్స్ వైపే ఉండడంతో సంబంధిత స్టాక్స్ సైతం పుంజుకున్నాయి.
ఇక శుక్రవారం మార్కెట్‌లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1245 పాయింట్లు లాభంతో 73745 వద్ద, నిఫ్టీ 355 పాయింట్ల లాభంతో 22338 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.
టాటా స్టీల్,జేఎస్‌డ్ల్యూ స్టీల్,టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, హిందాల్కో, మారుతి సుజికీ, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎస్‌బీఐ షేర్లు భారీ లాభాల్లో మూటగట్టుకోగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.
Comments
Please login to add a commentAdd a comment