
దేశీయ స్టాక్ మార్కెట్ ఓపెనింగ్స్‌లో అదరగొట్టాయి. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల లాభంతో 71,565 వద్ద నిఫ్టీ 52 పాయింట్ల స్వల్ప లాభంతో 21569 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్,ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. బీపీసీఎల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలు పెట్టాయి.