న్యూఢిల్లీ: మొత్తం రూ. 3,025 కోట్ల మోసపూరిత లావాదేవీలపై పాలనాధికారికి ట్రాన్సాక్షన్ ఆడిటర్ నుంచి నివేదిక అందినట్లు ప్రయివేట్ రంగ కంపెనీ శ్రేయీ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ తాజాగా పేర్కొంది. ఇది 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన నివేదికగా వెల్లడించింది.
సంక్షోభంలో చిక్కుకున్న శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, శ్రేఈ ఎక్విప్‌మెంట్ ఫైనాన్స్ బోర్డులను గతేడాది అక్టోబర్‌లో రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఆపై బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీజీఎం రజనీష్ శర్మను శ్రేయీ గ్రూప్ కంపెనీలకు పాలనాధికారిగా నియమించింది. తదుపరి పాలనాధికారికి సహకరించేందుకు ముగ్గురు సభ్యుల సలహాదారుల కమిటీని నియమించింది. శ్రేయీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment