
ప్రతీకాత్మక చిత్రం
Rakesh Jhunjhunwala Made Rs 6,000 Cr Profit Via Star Health's IPO Listing: ఫ్లాప్ టాక్‌తో మొదలైన స్టార్ హెల్త్ ఐపీవో లిస్టింగ్ గాడిన పడుతోంది. బిగ్ బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోటర్‌గా ఉన్న స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేర్లు బలహీన లిస్టింగ్ నుంచి రికవరీ అయ్యాయి. దీంతో ఆయన తన పెట్టుబడికి ప్రతిగా 6వేల కోట్ల రూపాయలకు పైనే లాభం అందుకున్నారు.
శుక్రవారం(డిసెంబర్ 10, 2021) మార్కెట్‌లో స్టార్ హెల్త్ సానుకూల ఫలితం అందుకుంది. షేర్ ధర 900రూ.గా 6 శాతం డిస్కౌంట్‌తో ముగింపు చవిచూసింది. ఈ పరిణామం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు సైతం భారీ లాభాన్ని అందించింది. స్టార్ హెల్త్‌లో ఉన్న సుమారు 1,287 కోట్ల రూ. పెట్టుబడిని 7,516 కోట్ల రూ.కి పెంచుకున్నారాయన. అంటే లాభం 6,229 కోట్ల రూపాయలన్నమాట. ఇక స్టార్ హెల్త్‌లో 14.98 వాటా (82,882,958 షేర్లు) రాకేశ్ పేరిట ఉండగా.. ఈయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా పేరిట 3.23 శాతం వాటా(17,870,977 షేర్లు ఉన్నాయి) అంటే ఇద్దరికీ కలిపి 10.08 కోట్ల షేర్లు ఉన్నాయన్నమాట. శుక్రవారం నాటి క్లోజింగ్ ధర రూ.906.85తో వీళ్లిద్దరి షేర్ల విలువను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం.. రూ.9,137 కోట్ల రూపాయలుగా ఉంటుంది. ఇక ఈ జంట మార్చి 2019 నుంచి నవంబర్ 2021 మధ్య తొమ్మిది ట్రాన్‌జాక్షన్స్‌లో (సగటున 155.25రూ. చొప్పున ఈ షేర్లను కొనుగోలు చేశారు.
లిస్టింగ్ పేలవం.. ఫ్లాట్‌గా ముగింపు
ఇదిలా ఉంటే స్టార్ హెల్త్ ఐపీవీ ఇష్యూ ధర (రూ.900)తో పోలిస్తే బీఎస్‌ఈలో 6% నష్టం తో రూ.847 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 8% నష్టపోయి రూ.827 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని దిగివచ్చింది. అయితే ద్వితియార్ధంలో మార్కెట్‌తో భాగంగా ఈ షేర్లు కూడా రికవరీ అయ్యాయి. మార్కెట్ ముగిసే సరికి 0.11 స్వల్ప లాభంతో రూ.901 వద్ద స్థిరపడింది. భారతదేశంలో రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఇదిలా ఉంటే దాదాపు 31% మార్కెట్ వాటాతో స్టార్ హెల్త్ సెక్టార్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది.
స్టార్ హెల్త్ ఐపీవో వివరాలు
స్టార్ హెల్త్ తన మూడు రోజుల ప్రారంభ వాటా విక్రయాన్ని నవంబర్ 30, మంగళవారం ప్రారంభించింది మరియు తరువాత డిసెంబర్ 2, గురువారం నాడు ముగించింది. కంపెనీ ప్రకటించిన ప్రకారం, స్టార్ హెల్త్ IPO యొక్క ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 870-900గా నిర్ణయించబడింది, అయితే ప్రారంభ వాటా విక్రయం ప్రైస్ బ్యాండ్ ఎగువ ముగింపులో రూ. 7,249 కోట్లు పొందవచ్చని అంచనా వేశారు. అయితే, ఎనిమిదో అతిపెద్ద IPOగా భావించిన స్టార్ హెల్త్ ఐపీవో 79% సబ్‌స్క్రిప్షన్‌ను మాత్రమే పొంది.. 6,400 కోట్ల రూ. ఐపీవోకి చేరింది.
చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. 5 నెలల్లో లక్షకు రూ.34 లక్షలు లాభం!
Comments
Please login to add a commentAdd a comment