దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 27.09 పాయింట్లు నష్టపోయి 73,876.82 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 22,434.70 వద్ద ముగింపు పలికాయి.
శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి.
రియల్టీ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించగా, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మరోవైపు పవర్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ (0.6 శాతం పెరుగుదల)తో బ్రాడర్ ఇండెక్స్‌లు తాజా రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment