సౌతాఫ్రికా కరోనా కొత్త వేరియంట్ దెబ్బ ప్రపంచ దేశాల ఇన్వెస్టర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చిన్న సెంటిమెంట్‌కే బయపడిపోయే ఇన్వెస్టర్లకు శుక్రవారం భారీ ఎత్తున నష్టాల్ని చవి చూశారు.అందుకు కారణం కరోనా వేరియంటేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వేరియంట్ వార్తతో ఈరోజు ఉదయం మార్కెట్లో షేర్ల ధరలు పడిపోయాయి.సెన్సెక్స్ భారీగా పతనమైంది.ఇన్వెస్టర్ల ఊపిరి ఆగినంతపనైంది. లక్షకోట్ల రూపాయాల సొమ్ము గాల్లో ఆవిరైంది. మీమర్స్‌కు ఓ వెపన్ దొరకినట్లైంది.
Indian Stock Market today:
Like if you know what I mean 😜#StockMarket#India #Nifty#Niftybank #memecoin #MEMES pic.twitter.com/QpfFNTF2Vm— Poonam Soni (@CodeByPoonam) November 22, 2021
దక్షిణాఫ్రికాను కబళించేస్తున్న కరోనా కొత్త వేరియంట్ జర్మనీతో పాటు ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తుంది. ముఖ్యంగా స‍్టాక్ మార్కెట్‌లో పెను విధ్వంసం సృష్టిస్తుంది. శుక్రవారం మార్కెట్‌లో కరోనా ఎఫెక్ట్‌తో దేశీయ సూచీలు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లను బూడిదపాలు చేశాయి.
Mean while stock market is not gender biased unlike this meme 😜#StockMarket #investments pic.twitter.com/0AcxVTs2IV
— Swapnil Kommawar (@KommawarSwapnil) November 20, 2021
అయితే కొద్దిరోజుల క్రితం వరకు బుల్ రంకెలేయడంతో ఇన్వెస్టర్లతో పాటు కాస్తో కూస్తో అవగాహన ఉన్న వారికి సైతం అదో మాయలా అనిపించింది. ఇన్వెస్టర్లంతా ఏదో మేనియాలో ఉన్నట్లు, అదే ప్రపంచం అన్న దశకు చేరుకున్నారు. కానీ తాజాగా కోవిడ్ దెబ్బతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు, బిగినర్లు సైతం ఏమాత్రం అవగానలేకుండా పెట్టుబడి పెడితే ఎంత నష్టపోతామో గుర్తించారు.
ITC when it realises that PayTM is the new meme stock in the market 😂 pic.twitter.com/MjsB4r8Ir8
— Finance Memes (@Qid_Memez) November 20, 2021
ఇక ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి అభిప్రాయం అలా ఉంటే మీమ్ క్రియేటర్స్‌కు ఓ వెపన్ దొరికినట్లైంది. అందుకే ఎప్పుడు చేసిన మీమ్స్‌నే తాజాగా ట్రెడింగ్ చేస్తున్నారు. ముదుపర్లు ముద్దుగా ఇండియన్ బిగ్‌బుల్ అని పిలుచుకునే రాకేష్ ఝున్ ఝున్ వాలా, అక్షయ్ కుమార్, పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మతో పాటు పలు సినిమాల్లోని వీడియోలతో ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ పై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్‌బుల్ హాయిగా నిద్రపోతున్నారని కామెంట‍్లు చేస్తున్నారు.
చదవండి : బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిద పాలు
Comments
Please login to add a commentAdd a comment