దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడయ్యాయి. డాలర్ పడిపోవడంతో బెంచ్‌మార్క్ సూచీలు వరుస నష్టాల నుంచి కోలుకుని లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 156.80 పాయింట్లు లేదా 0.83% లాభపడి 19,145.95 వద్ద స్థిరపడగా, సెన్సెక్స్ 533.44 పాయింట్లు లేదా 0.84% పెరిగి 64,124.77 వద్ద ముగిసింది.
నిఫ్టీలో బ్రిటానియా ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. హీరో మోటోకార్ప్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, బజాజ్ ఆటో, ఓఎన్‌జీసీ నష్టాల్లో ముగిశాయి. ప్రభుత్వ బ్యాంక్‌లు, రియల్ ఎస్టేట్, ఆయిల్ & గ్యాస్, మెటల్, రియల్ ఎస్టేట్ రంగాల సూచీలు దాదాపు 2 శాతం వరకు పెరిగాయి.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక వడ్డీ రేట్లకు సంబంధించి సానుకూల ప్రకటన చేశారు. పెడ్ వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వడ్డీ రేట్ల పెంపు దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆర్థిక వృద్ధిపై సానుకూల ప్రకటన చేయడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగియగా.. ప్రపంచ మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment