
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 72 పాయింట్ల నష్టంతో 60152 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 17,700 దగ్గర కొనసాగుతోంది.
హిందాల్కో, బజాజ్ ఫైనాన్స్,టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్,హెచ్‌సీఎల్ టెక్, ఎసియన్ పెయింట్స్, సన్ ఫార్మా,అపోలో హాస్పిటల్,టైటాన్ కంపెనీ, సిప్లా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా.. అదానీ ఎంటర్ ప్రైజెస్, లార్సెన్,బజాజ్ ఆటో, అదానో పోర్ట్స్, ఎన్‌టీపీసీ, బ్రిటానియా,బీపీసీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.