
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, రూపాయి బలపడడం, ఎఫ్‌డీఐల వెల్లువ మధ్య మార్కెట్ల ర్యాలీకి దోహదం చేశాయి. ఇక చివరకు, సెన్సెక్స్ 765.04 పాయింట్లు (1.36%) పెరిగి 56,889.76 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 225.80 పాయింట్లు (1.35%) లాభపడి 16,931 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.28 వద్ద నిలిచింది.
భారతీ ఎయిర్ టెల్, దివిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, కోల్ ఇండియాలు నిఫ్టీలో అగ్రస్థానంలో ఉన్నాయి. టెక్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, నెస్లే, ఇన్ఫోసిస్, టిసీఎస్ షేర్లు టాప్ లూజర్లలో ఉన్నాయి. ఐటి మినహా ఇతర అన్ని సూచీలు లాభాలతో ముగిశాయి.(చదవండి: ఓలా, టెస్లాకు పోటీగా సింపుల్ ఎనర్జీ సంచలన నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment