దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:17 సమయానికి నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 25,895కు చేరింది. సెన్సెక్స్ 341 పాయింట్లు లాభపడి 84,645 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 100.84 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 3.77 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.38 శాతం పుంజుకుంది.
ఇదీ చదవండి: డిపాజిట్ల పెంపునకు వినూత్న ప్రయత్నాలు
మదుపర్లు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల ట్రెండ్ సోమవారం దేశీయ స్టాక్‌మార్కెట్‌ను నడిపించాయని నిపుణులు తెలియజేశారు. ఇప్పటికే జీవితకాల గరిష్ఠాలను చేరిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో నిన్నటి మార్కెట్లో నష్టాలు ఎదురయ్యాయి. రానున్న యూఎస్ ఎన్నికలు, ఎఫ్‌ఐఐలు చైనావైపు మొగ్గు చూపుతుండడం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు నుంచి ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ సంబంధించి జులైలో ప్రకటించిన నిబంధనలు అమలు చేయబోతున్నట్లు సెబీ తెలిపింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment