దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 22,303కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు పుంజుకుని 73,469 వద్ద ట్రేడవుతోంది.
డాలర్ ఇండెక్స్ 103.8 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 82.1 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.16 శాతానికి చేరాయి. యూఎస్ మార్కెట్‌లో ట్రేడవుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు నెట్‌ఫ్లిక్స్ 3 శాతం, మైక్రోసాఫ్ట్ 3 శాతం, టెస్లా 4 శాతం, యాపిల్ 3 శాతం నష్టాల్లోకి జారుకున్నాయి.
మార్కెట్‌లోని కొన్ని అంశాలు..
- టాటా మోటార్స్‌ను రెండు వేర్వేరు నమోదిత సంస్థలుగా విభజించడానికి బోర్డు అనుమతి లభించింది. దాంతో కంపెనీ షేరు ఇంట్రాడేలో 7.94% పెరిగి రూ.1,065.60 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది. చివరకు 3.52% లాభంతో రూ.1,021.95 వద్ద ముగిసింది.
- పసిడి రుణాల మంజూరు, పంపిణీపై ఆర్‌బీఐ ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ కంపెనీపై ఆంక్షలు విధించింది.
- విద్యుత్తు వాహన ఛార్జర్ తయారీ సంస్థ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ షేరు అరంగేట్రంలో దూసుకెళ్లింది. ఇష్యూ ధర రూ.142తో పోలిస్తే బీఎస్‌ఈలో షేరు 85.91% లాభంతో రూ.264 వద్ద నమోదైంది.
- ప్లాటినం ఇండస్ట్రీస్ షేరు ఇష్యూ ధర రూ.171తో పోలిస్తే బీఎస్‌ఈలో 33.33% లాభంతో రూ.228 వద్ద నమోదైంది.
- రానున్న 2-3 ఏళ్లలో ‘రీజియన్ ఓవర్‌సీస్’లో మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ నిలుస్తుందని మెర్సిడెస్ బెంజ్ అంచనా వేసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment