సోమవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 450.99 పాయింట్లు లేదా 0.57 శాతం లాభంతో 80,253.78 వద్ద, నిఫ్టీ 142.90 పాయింట్లు లేదా 0.59 శాతం లాభంతో 24,274.00 వద్ద నిలిచాయి.
అల్ట్రా టెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీలు నష్టాలను చవి చూశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:53 సమయానికి నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 24,124కు చేరింది. సెన్సెక్స్ 108 పాయింట్లు దిగజారి 79,689 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.11 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72.1 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.42 శాతం లాభపడింది. నాస్‌డాక్ 0.83 శాతం పుంజుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం (జులై–సెపె్టంబర్)లో దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను అందుకోలేకపోయింది. గత 7 త్రైమాసికాలలోనే అత్యల్పంగా 5.4 శాతంగా నమోదైంది. జీడీపీ గణాంకాలు గత వారాంతాన మార్కెట్లు ముగిశాక వెలువడటంతో ఈ ప్రభావం నేడు (2న) దేశీ స్టాక్ మార్కెట్లపై కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు అంతర్జాతీయ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, స్థూల ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు తెలియజేశారు. ఈ వారం చివర్లో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పరపతి సమీక్షను చేపట్టనుంది. దీంతో ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment