శుక్రవారం ఉదయం మిశ్రమంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లో మొగిశాయి. సెన్సెక్స్ 87.03 పాయింట్లు లేదా 0.11 శాతం నష్టంతో 81,678.83 వద్ద, నిఫ్టీ 39.35 పాయింట్లు లేదా 0.16 శాతం నష్టంతో 24,669.05 వద్ద నిలిచాయి.
టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వంటి కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. అదానీ పోర్ట్స్, సిప్లా, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటివి నష్టాల జాబితాలో చేశాయి.
ఆర్‌బీఐ గవర్నర్ కీలక ప్రకటనకు ముందు భారత బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 శుక్రవారం మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 108 పాయింట్లు లేదా 0.13 శాతం పెరిగి 81,874 వద్ద ఉంది. నిఫ్టీ 12 పాయింట్లు లేదా 0.05 శాతం నష్టంతో 24,695 వద్ద ఉంది.
గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశం కీలక నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం మీడియాకు వివరిస్తారు. భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో కీలక రుణ రేటు రెపో యథాతథంగానే కొనసాగే అవకాశం ఉందన్నది మెజారిటీ ఆర్థికవేత్తల అంచనా.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment