మంగళవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1.59 పాయింట్లు లేదా 0.0019 శాతం లాభంతో 81,510.05 వద్ద, నిఫ్టీ 8.95 పాయింట్లు లేదా 0.036 శాతం నష్టంతో 24,610.05 వద్ద నిలిచాయి.
శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. భారతి ఎయిర్‌టెల్, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి సంస్థలు నష్టాల జాబితాలో నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 24,599కు చేరింది. సెన్సెక్స్ 81 పాయింట్లు దిగజారి 81,426 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 106.14 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 72 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.61 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 0.62 శాతం దిగజారింది.
దేశీయంగా అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ వివరాలు గురువారం(12న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి వార్షికంగా 3.1 శాతం పుంజుకుంది. ఆర్థికవేత్తల 2.5 శాతం అంచనాలను అధిగమించింది. ఇదేవిధంగా నవంబర్ నెలకు సంబంధించిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు 12న వెలువడనున్నాయి. అక్టోబర్‌లో సీపీఐ వార్షిక రేటు 6.21 శాతంగా నమోదైంది. ఎఫ్‌ఐఐలు పెట్టుబడులకు ఆసక్తి చూపడం ట్రేడర్లను ప్రభావితం చేసే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment