న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కోసం 2025 నాటికి దేశవ్యాప్తంగా 5000 విద్యుత్ వాహన (ఈవీ)చార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేస్తామని టెస్లా పవర్ యూఎస్‌ఏ ప్రకటించింది. ఫ్రాంఛైజీలుగా పనిచేస్తున్న టెస్లా పవర్ షాపుల్లో వీటిని నెలకొల్పుతామని తెలిపింది.
టెస్లా పవర్ యూఎస్‌ఏ ఢిల్లీలో భారత వ్యాపార సమావేశాన్ని నిర్వహించింది. విద్యుత్ వాహనాల ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్నామని కంపెనీ భారత విభాగపు ఎండీ కవీందర్ ఖురానా తెలిపారు. భారత్‌లో 20కు పైగా రాష్ట్రాల్లో కంపెనీకి 200కు పైగా డిస్ట్రిబ్యూటర్లు, 250కు పైగా టెస్లా పవర్ షాపులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment