తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి: నేటి కొత్త ధరలు ఇలా.. | Today Gold and Silver Price 10th Sep 2024 | Sakshi
Sakshi News home page

Gold and Silver Price: తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి: నేటి కొత్త ధరలు ఇలా..

Published Tue, Sep 10 2024 2:44 PM | Last Updated on Tue, Sep 10 2024 3:14 PM

Today Gold and Silver Price 10th Sep 2024

సెప్టెంబర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పసిడి ధర రూ. 750 తగ్గింది. మధ్యలో ఒకరోజు (సెప్టెంబర్ 6) మాత్రమే గోల్డ్ రేటు గరిష్టంగా రూ.550 పెరిగింది. కాగా ఈ రోజు (మంగళవారం) తులం ధర రూ.30 మాత్రమే తగ్గింది. దీంతో నిన్నటికి.. ఈ రోజుకు ధరల్లో కొంత వ్యత్యాసం కనిపించింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు వరుసగా రూ. 66,920 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.72,990 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు కొంత తక్కువగా ఉన్నాయి. తులం ధర సోమవారం కంటే రూ.30 తగ్గింది.

హైదరాబాద్‌ విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 66770 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ. 72840 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో కూడా కొనసాగుతాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 30 మాత్రమే తగ్గినట్లు స్పష్టమవుతోంది.

చెన్నైలో కూడా బంగారం ధరలు రూ. 30 మాత్రమే తగ్గింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 66770 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72840గా ఉంది.

వెండి ధరలు
బంగారం ధరల స్వల్పంగా తగ్గినప్పటికీ.. వెండి ధరలు మాత్రం రూ. 1000 పెరిగింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 91000 వద్ద నిలిచింది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా కొనసాగుతాయి.

ఇదీ చదవండి: రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్: ఎక్కడంటే?

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement