గత ఏడాది చివరలో భారీగా పెరిగి.. న్యూ ఇయర్ ప్రారంభంలో కూడా కొంత భయపెట్టిన బంగారం ధరలు.. ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సంక్రాంతికి గోల్డ్ కొనాలనుకునే వారికి ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. 2024 జనవరి 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు పసిడి ధరలు తులం మీద ఏకంగా రూ. 1000 కంటే ఎక్కువ తగ్గింది. ఈ రోజు గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు మొదలైన ప్రాంతాల్లో కూడా ఈ రోజు బంగారం ధరలు రూ.57,800 (10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్), రూ.63050 (10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్)గా ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ.200, రూ.220 తగ్గినట్లు తెలుస్తోంది.
చెన్నైలో కూడా ఈ రోజు బంగారం ధరలు 10 గ్రాముల మీద వరుసగా రూ. 200, రూ. 220 తగ్గింది. దీంతో నేటి గోల్డ్ ధరలు రూ. 58,300 (22 క్యారెట్స్ గోల్డ్), రూ. 63,600 (24 క్యారెట్స్ గోల్డ్)గా ఉన్నాయి.
ఢిల్లీలో నేడు బంగారం ధరలు గరిష్టంగా రూ. 220 తగ్గింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు రూ. 57950 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధరలు రూ. 63200గా ఉంది.
ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం కోసం 30 సార్లు అప్లై.. ఎట్టకేలకు జాబ్ కొట్టేసింది, కానీ..
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా ఈ రోజు కేజీ మీద రూ. 200 తగ్గింది. దీంతో ఒక కేజీ గోల్డ్ రేటు రూ. 76400కి చేరింది. న్యూ ఇయర్ ప్రారంభమైనప్పటి నుంచి వెండి ధర ఇప్పటివరకు ఏకంగా రూ. 2500 తగ్గిందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment