
ఈ నెల 19, 20 తేదీల్లో పెరిగిన బంగారం ధరలు 21, 22, 23 తేదీల్లో ఎలాంటి పెరుగుదలకు లోను కాకుండా ఉన్నప్పటికీ, గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతోంది. నిన్న, ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర మీద రూ. 100 వరకు తగ్గింది. నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ రోజు హైదరాబాద్, విజయవాడల్లో తులం బంగారం ధర రూ. 57700 (22 క్యారెట్స్), రూ. 62950 (24 క్యారెట్స్) వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు 10 గ్రాముల మీద రూ. 50 తగ్గింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి.
చెన్నై, ఢిల్లీలలో కూడా ఈ రోజు రూ. 50 వరకు తగ్గింది. ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం విలువ రూ. 58300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63600 వద్ద ఉంది. ఢిల్లీలో నేడు 10 గ్రామ్స్ 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ గోల్డ్ రేటు వరుసగా రూ. 57850, రూ. 63100గా ఉంది.
వెండి ధరలు
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతుంటే.. వెండి ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఒక కేజీ వెండి ధర నిన్నటి కంటే రూ. 700 పెరిగినట్లు సమాచారం. వెండి ధర నిన్న, ఈ రోజు మాత్రం ఏకంగా రూ. 1000 పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment