దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం రోజు చమురు ధరలు స్వల్పంగా పెరిగినా శుక్రవారం రోజు వాటి ధరలు అలాగే స్థిరంగా ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి(ఒపెక్) లతో జరిగే చర్చలు విఫలం కావడంతో వాటి ప్రభావం పెట్రో ధరలు పెరగడానికి కారణమైంది. ఈ రెండు నెలల కాలంలో పెట్రోల్ ధర రూ. 10కి పెరిగింది. దీంతో దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో చమురు ధరలు రికార్డ్ స్థాయిల్ని నమోదు చేశాయి.
ఇక శుక్రవారం రోజు పెట్రోల్ డీజిల్ ధరలు వివరాలు
హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52గా ఉండగా డీజిల్ ధర రూ. 97.96గా ఉంది
న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54 గా ఉండగా డీజిల్ ధర రూ.89.87 గా ఉంది
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.23 గా ఉండగా డీజిల్ ధర రూ.94.39 గా ఉంది.
ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.54 గా ఉండగా డీజిల్ ధర రూ. 97.45గా ఉంది.
బెంగళూరులో పెట్రోల్ ధర రూ.104.94 గా ఉండగా డీజిల్ ధర రూ. రూ.95.26 గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment