దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లే దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయ అంశాల ప్రభావం పడింది. రష్యా - ఉక్రెయిన్ దేశాల సంక్షోభం,చైనాలో తలెత్తిన కరోనా, బ్రెంట్, నైమెక్స్ చమురు ధరలు 110 డాలర్ల స్థాయికి చేరడంతో దేశీయ ఇన్వెస్ట్‌ర్లు పెట్టుబడులు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
దీంతో సోమవారం ఉదయం 10.30గంటల సమయానికి సెన్సెక్స్ 209 పాయింట్ల నష్టపోయి 57626 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ సైతం 53 పాయింట్లు నష్ట పోయి 17227వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తుంది.
హిందాల్కో,మారుతి సుజికీ, టాటా స్టీల్,ఓఎన్‌జీసీ, జేఎస్‌డ్ల్యూ స్టీల్,సన్ ఫార్మా, కిప్లా,విప్రో, యూపీఎల్,కోల్ ఇండియా,టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..కొటాక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్,అదానీ పోర్ట్,హెచ్‌యూఎల్, బ్రిటానియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్ని చవిచూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment