ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి.
ఫలితంగా ఈ వారం తొలిరోజే దేశీయ స్టాక్ మార్కెట్‌లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి 144 పాయింట్ల నష్టంతో 72998 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 22174 వద్ద కొనసాగుతున్నాయి.
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, యూపీఎల్,అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment