భారతదేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పించే రంగాల్లో ఒకటి 'ఐటీ' అని అందరికి తెలుసు. ప్రతి సంవత్సరం లెక్కకు మించిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. అలాంటి ఐటీ రంగం ఇప్పుడు రిక్రూట్‌మెంట్స్ జరపకపోగా.. ఉన్న ఉద్యోగులను కూడా తొలగిస్తుంది.
కొన్ని నివేదికల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశంలోని టాప్ 10 దిగ్గజ కంపెనీల ఉద్యోగుల సంఖ్య 21,327కి పడిపోయినట్లు సమాచారం. గత సంవత్సరం ఇదే సమయంలో ఈ కంపెనీలలోని ఉద్యోగుల సంఖ్య 69,634 కావడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఎంతమంది తగ్గారో స్పష్టంగా తెలుస్తోంది.
టాప్ 10 కంపెనీలలో ఆరు కంపెనీల ఉద్యోగుల సంఖ్య తగ్గింది, కాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS), పెర్సిస్టెంట్, కోపోర్ట్ వంటి నాలుగు కంపెనీలు మాత్రం కొంతవరకు నియామకాలను చేపట్టి ఉద్యోగుల సంఖ్యను పెంచింది. మొత్తం మీద చాలా కంపెనీలు కొత్త వారిని చేర్చుకోవడం కంటే కూడా ఉన్న వారి నైపుణ్యాలనే మెరుగుపరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు! ఎక్కడంటే?)
కరోనా మహమ్మారి భారతదేశంలో విజృంభించినప్పటి నుంచి ఉద్యోగుల జీవితాలు తలకిందులైపోయాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అందించగా.. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులనే తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా చాలా వరకు ఉద్యోగుల మీద ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: సీఏ చదివి ఈ పని చేస్తావా? అని చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!)
తొలగింపు & నియామకాలు అలా ఉంచితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగుల పాలిట మరో గండంగా మారింది. ఇప్పటికే చాలా కంపెనీలు కృత్రిమ మేధను ఉపయోగిస్తూ.. ఎంప్లాయిస్ సంఖ్యను తగ్గిస్తోంది. భవిష్యత్తులో కూడా క్రమంగా ఇదే జరిగితే ఉద్యోగుల సంఖ్య భారీగా క్షిణించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment