ప్రముఖ ఆటో మేకర్ మారుతి సుజుకి యూజర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొని వస్తుంది. ఇప్పటి వరకు ఇలా తీసుకొని వచ్చిన కార్లలో భారీగా ప్రజాదరణ పొందిన మోడల్ "విటారా బ్రెజ్జా". 2016లో మొట్ట మొదటి సరిగా ఈ విటారా బ్రెజ్జా మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. నేటికి దేశంలో అత్యధికంగా అమ్ముడు అవుతున్న కార్లలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా ఒకటి.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జాలో కొత్త తరం మోడల్ కారును మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. అయితే, ఈ కారు టెస్టింగ్ కోసం రోడ్డు మీద చక్కర్లు కొడుతుంది. 2022 ప్రారంభంలో రాబోతున్న కారుకు సంబంధించిన ఫీచర్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారుకు సంబంధించిన ఆసక్తికర ఫీచర్స్ గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
1. సన్ రూఫ్
2022 ప్రారంభంలో రాబోతున్న మారుతి సుజుకి బ్రెజ్జా సన్ రూఫ్‌తో రానుంది. ఎక్కువ శాతం మంది వినియోగదారులు సన్ రూఫ్ ఉన్న కార్లను ఇష్ట పడుతుండటంతో, మారుతి సుజుకి ఈ కారును సన్ రూఫ్‌తో తీసుకవస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి, మారుతి సుజుకి బ్రెజ్జా నుంచి రాబోతున్న సన్ రూఫ్‌తో మొదటి మోడల్ ఇది కావచ్చు.
2. పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్
లీక్ అయిన ఫోటోలు కొత్త బ్రెజ్జా కారు పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మారుతి సుజుకి బ్రెజ్జా జెడ్ ఎక్స్ఐ, జెడ్ ఎక్స్ఐ ప్లస్ వేరియెంట్లలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, వాయిస్ కమాండ్ సర్వీసులు సపోర్ట్ చేస్తాయి.
3. వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ
రాబోయే మారుతి సుజుకి బ్రెజ్జా కొత్త ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేయనుంది. దీంతో యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌ని సిస్టమ్'తో కనెక్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. బ్రెజా ప్రీమియం వేరియంట్ కారులో ఈ ఫీచర్ తీసుకొస్తున్నట్లు భావిస్తున్నారు.
4. కొత్త ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్
ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఇప్పుడు అన్ని వాహనాలలో డిజిటల్'గా మారడంతో డ్రైవర్ డిస్ ప్లే భారీ మార్పును మనం గమనించవచ్చు.
5. వైర్ లెస్ ఛార్జింగ్
ప్రత్యర్ధి కంపెనీల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడం కోసం కంపెనీ ఈ కొత్త బ్రెజ్జా కారులో వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ సపోర్ట్ సిస్టమ్ తీసుకొస్తుందని తెలుస్తుంది.
6. కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
మారుతి సుజుకి కొత్త కారులో అధునాతన కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కూడా అందిస్తుంది. ఈ టెక్నాలజీ ఇంజిన్ ని స్వయం చాలకంగా స్టార్ట్ లేదా స్టాప్ చేయడం, హెడ్ ల్యాంప్స్ ను వాతావరణానికి తగ్గట్టు నియంత్రిస్తుంది.
7. 360 డిగ్రీల కెమెరా
సరికొత్త బ్రెజ్జా కారులో 360 డిగ్రీల కెమెరాతో రావచ్చు. ఈ ఫీచర్ డ్రైవరుకు ఎంతగానో సహాయ పడుతుంది.
8. ప్యాడిల్ షిఫ్టర్లు
కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా కారు ఆటోమేటిక్ వేరియెంట్ ప్యాడిల్ షిఫ్టర్లతో రావచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం సబ్ కాంపాక్ట్ ఎస్యువి కియా సోనెట్లో మాత్రమే లభిస్తుంది.
9. హైబ్రిడ్ టెక్నాలజీ
కొత్త బ్రెజ్జాలో ప్రస్తుత 12వీ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీని 48వీ హైబ్రిడ్ వ్యవస్థతో ఆటోమేకర్ భర్తీ చేయనున్నట్లు కొన్ని నివేదికలు సూచించాయి. ఇది అవుట్ గోయింగ్ మోడల్ కంటే మెరుగైన మైలేజీని ఇస్తుంది. ఈ కొత్త మోడల్ 4, సిలిండర్ల 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ తో రావచ్చు. ఇది 103బిహెచ్ పీ పవర్, 138 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్, ఫోర్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్ తో రావచ్చు.
Comments
Please login to add a commentAdd a comment