Pakistan Popular Cars: మనం ఇప్పటి వరకు చాలా కథనాలతో భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లు, సేఫ్టీ కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు, మంచి పాపులర్ కార్లను గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఎక్కువగా ఉపయోగించే పాపులర్ కార్లను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
సుజుకి ఆల్టో
పాకిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల జాబితాలో సుజుకి ఆల్టో ఒకటి. దీని ధర 22,51,000 పాకిస్థాన్ రూపాయలు (PKR). భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 6 లక్షల కంటే ఎక్కువ. ఈ కారు ఇండియాలో అమ్ముడయ్యే కారు కంటే భిన్నంగా ఉంటుంది. 2023 మార్చిలో మొత్తం 2542 ఆల్టో యూనిట్లు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి.
సుజుకి స్విఫ్ట్
భారతీయ విఫణిలో మాత్రమే కాకుండా పాకిస్థాన్ ప్రజలను కూడా ఎక్కువ ఆకర్శించిన కారు సుజుకి స్విఫ్ట్. దీని ప్రారంభ ధర PKR 42,56,000. గత మార్చి నెలలో కంపెనీ ఆ దేశంలో 877 యూనిట్లను విక్రయించింది. ఇది కేవలం 1.2-లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ ఎంపికలో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 89 bhp పవర్, 4200 rpm వద్ద 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
సుజుకి బోలన్
ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి ఓమ్ని మాదిరిగా అమ్ముడవుతున్న కారు పాకిస్థాన్‌లో బోలాన్ పేరుతో అమ్ముడవుతోంది. ఓమ్నికి.. బోలాన్ కారుకి డిజైన్ విషయంలో కొంత వ్యత్యాసం ఉంటుంది. 2023 మార్చిలో 782 యూనిట్లు అమ్ముడైన ఈ కారు ధర PKR 19,40,000. ఇది 3-సిలిండర్ OHC 6-వాల్వ్ ఇంజన్‌తో 5000 rpm వద్ద 37 bhp, 3000 rpm వద్ద 62 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
టయోటా కరోలా ఆల్టిస్ ఎక్స్
పాకిస్థాన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అత్యధిక అమ్మకాలు పొందుతున్న కారు 'టయోటా కరోలా ఆల్టిస్ ఎక్స్'. దీని ప్రారంభ ధర PKR 61,69,000. 2023 మార్చిలో ఇది 778 యూనిట్ల అమ్మకాలను పొందింది. చూడటానికి హోండా సిటీ మాదిరిగా ఉండే ఈ కారు రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: మహీంద్రా ప్రియులకు గుడ్ న్యూస్.. థార్ 5 డోర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది!)
హోండా సిటీ
ఎక్కువ మంది భారతీయులను ఆకర్శించిన హోండా సిటీ, పాకిస్థాన్ వాహన ప్రియులను కూడా ఆకర్శించడంలో విజయం సాధించింది. 2023 మార్చిలో 611 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. ఇది కూడా రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర PKR 47,79,000. ఎంచుకునే వేరియంట్‌ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.
(ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న కొత్త కార్లు - ఇన్విక్టో నుంచి ఎక్స్‌టర్ వరకు..)
నిజానికి పాక్ ఆర్థిక వ్యవస్థ భారత్‌లో కొంత భాగం మాత్రమే కావచ్చు, కానీ ఆటోమోటివ్ ఉత్పత్తిలో ప్రపంచంలో 35వ స్థానంలో ఉంది. అంతే కాకుండా జాతీయ ఖజానాకు ప్రతి సంవత్సరం దాదాపు $220 మిలియన్ డాలర్లకు దోహదం చేస్తోంది. అయితే గత కొంత కాలంలో అక్కడ ఏర్పడిన అంతర్గత సవాళ్లు, షట్‌డౌన్‌లు, రాజకీయ అస్థిర వాతావరణం కారణంగా ఆటోమోటివ్ పరిశ్రమ కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment