న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై 10 బిలియన్ జపాన్ యెన్‌లు (సుమారు రూ. 500 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు తోషిబా గ్రూప్ వెల్లడించింది. పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ సామర్థ్యాన్ని 1.5 రెట్లు పెంచుకునేందుకు తోషిబా ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) ఈ నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది.
2024–2026 ఆర్థిక సంవత్సరాల మధ్య ఈ మేరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు టీటీడీఐ చైర్‌పర్సన్ హిరోషి ఫురుటా తెలిపారు. భారత్‌లో తయారీ, భారత్ నుంచి ఎగుమతుల నినాదానికి అనుగుణంగా చేసే ఈ పెట్టుబడులతో నిర్వహణ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపర్చుకోనున్నట్లు వివరించారు. భారత మార్కెట్లో ట్రాన్స్‌ఫార్మర్ల డిమాండ్‌ను తీర్చడానికి, ఎగుమతులను పెంచుకోవడానికి పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల విస్తరణ తోడ్పడగలదని హిరోషి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment