గురుగ్రామ్: సప్లయ్ చైన్, లాజిస్టిక్స్ సేవల్లోని ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. స్టాండలోన్ ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.912 కోట్లకు చేరింది. పన్ను అనంతరం లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 57 కోట్లతో పోలిస్తే 17 శాతం వరకు వృద్ధి చెంది రూ.67 కోట్లకు చేరింది.
ఎబిట్డా మార్జిన్ 11.9 శాతంగా ఉంది. కన్సాలిడేటెడ్ (అనుబంధ సంస్థలతో కలిపి)గా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెపె్టంబర్) ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 6 శాతం పెరిగి రూ.1963 కోట్లుగా నమోదైంది. లాభం 13 శాతం వరకు పెరిగి రూ.171 కోట్లుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment