న్యూఢిల్లీ: ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధిత ఈపీసీ కంపెనీ ట్రాన్స్‌రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఈ నెల 19న ప్రారంభమై 23న ముగియనుంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.01 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్ సంస్థ ఆజన్మా హోల్డింగ్స్ ప్రయివేట్ లిమిటెడ్ విక్రయానికి ఉంచనుంది.
ప్రస్తుతం ప్రమోటర్లకు 83.22 శాతం వాటా ఉంది. ఈ నెల 18న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను కేటాయించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. స్ట్రక్చర్స్, కండక్టర్స్, మోనోపోల్స్ తదితర సమీకృత తయారీ సౌకర్యాలను కంపెనీ కలిగి ఉంది.
రూ. 2,000 కోట్లపై కన్ను
విమానాశ్రయాలలో ట్రావెల్ క్విక్ సర్వీసు రెస్టారెంట్లు, లాంజ్ బిజినెస్ నిర్వహించే ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రధా నంగా భారత్, మలేషియాలో కంపెనీ సర్వీసులు అందిస్తోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ కపూర్ కుటుంబ ట్రస్ట్ రూ. 2,000 కోట్ల విలువైన వాటాను విక్రయానికి ఉంచనుంది.
దీంతో ఐపీవో ద్వారా కంపెనీ కాకుండా ప్రమోటర్ సంస్థ నిధులు సమకూర్చుకోనుంది. ప్రమోటర్లలో ఎస్‌ఎస్‌పీ గ్రూప్‌సహా.. కపూర్ కుటుంబ ట్రస్ట్, వరుణ్ కపూర్, కరణ్ కపూర్ ఉన్నారు. ఎస్‌ఎస్‌పీ లండన్ స్టాక్ ఎక్సే్ఛంజీ లిస్టయిన కంపెనీ. ఆదాయంరీత్యా 2024లో గ్లోబల్ ట్రావెల్ ఫుడ్, పానీయాల విభాగంలో దిగ్గజంగా నిలిచినట్లు రేటింగ్ సంస్థ క్రిసిల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment