ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. దీంతో, చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొని వచ్చేందుక సిద్ద పడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఐఐటీ-ఢిల్లీ ఇంక్యుబేటెడ్ ఈవీ స్టార్టప్ ట్రూవ్ మోటార్ తన ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసే ముందు తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ హైపర్-స్పోర్ట్స్ బైకును టీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్ గంటకు 200 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్లనుంది. అలాగే, సూపర్ బైక్ 3 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
లేజర్ లైటింగ్ ప్యాకేజీ, ఎల్ఈడీ అడ్వాన్స్డ్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, 360 డిగ్రీల కెమెరా, కనెక్టెడ్ ఫీచర్లతో టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే, జీపీఎస్ నావిగేషన్, రియల్ టైమ్ వెహికల్ డయాగ్నోస్టిక్ వంటి ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్ రానుందని ఈవీ స్టార్టప్ పేర్కొంది. ఈ బైక్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో లాంచ్ కానుంది. ఈ సూపర్ బైక్ 40 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేసే లిక్విడ్-కూల్డ్ ఏసీ ఇండక్షన్ మోటార్ కలిగి ఉంది. ఈ సూపర్ బైక్ ఏఐ ఆధారిత వ్యవస్థతో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. బ్రేకింగ్ కోసం ఇది బ్రేక్ డ్యూయల్ ఛానల్ ఎబిఎస్'తో బ్రెంబోను ఉపయోగిస్తుంది. ఈ బైక్ సస్పెన్షన్'ను సర్దుబాటు చేసుకోవచ్చు.
కొన్ని పేటెంట్ టెక్నాలజీలతో బైక్ వస్తుంది అని ట్రూవ్ పేర్కొంది. రాబోయే సూపర్ బైక్ లాంచ్ తర్వాత సురక్షితమైన ద్విచక్ర వాహనంగా నిలుస్తుందని కంపెనీ పేర్కొంది. క్లాసిక్, కేఫ్ రేసర్, నేకెడ్ స్ట్రీట్ బైక్, ఎండురో, స్క్రాంబ్లర్'తో సహా మరో ఐదు మోడళ్లు భవిష్యత్ కాలంలో తీసుకొని రనున్నట్లు ఈవీ స్టార్టప్ తెలిపింది. ట్రూవ్ మోటార్ తన స్వంత మెటావర్స్ ఎకోసిస్టమ్'తో మొట్టమొదటి బ్లాక్ చైన్ ఇంటిగ్రేటెడ్ ఈవీ కంపెనీ అవుతుందని తెలిపింది. వినియోగదారుల కోసం ఒక ప్రత్యేకమైన రీడింగ్ సిస్టమ్ కూడా వస్తుందని పేర్కొంది.
(చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ న్యూస్..!)
Comments
Please login to add a commentAdd a comment