
గత రెండు నెల కాలంగా స్టాక్ మార్కెట్ కిందకు పడుతుండటంతో కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరి అవుతుంది. ఈ సమయంలో దిగ్గజ కంపెనీల షేర్లు భారీగా పడిపోతున్న సమయంలో.. చిన్న చిన్న కంపెనీల షేర్లు మాత్రం మదుపర్లకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ కంపెనీల షేర్లు కొనుగోలు చేసిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. అలాంటి మల్టీబ్యాగర్ కంపెనీలలో టీటీఐ ఎంటర్ ప్రైజ్ స్టాక్ ఒకటి. ఈ పెన్నీ స్టాక్ కంపెనీ ధర ఈ ఏడాది జనవరి 4న రూ.1.33 షేరు ధర నేడు(డిసెంబర్ 20) మార్కెట్ ముగిసే సమయానికి రూ.40.80లుగా ఉంది.
అంటే, ఈ ఏడాది జనవరి 4న లక్ష రూపాయలు విలువ చేసే టీటీఐ ఎంటర్ ప్రైజ్ స్టాక్స్ కొన్న వారికి సుమారు రూ.30 లక్షల లాభం వచ్చింది. ఈ సమయంలో ఈ మల్టీబ్యాగర్ కంపెనీ షేర్ విలువ 30 రేట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది నవంబర్ 30న ఈ కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్టస్థాయి రూ.50.15ను తాకింది. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇవన్నీ సామాన్యులకు అర్థం కాని ఒక సబ్జెక్ట్. స్టాక్ మార్కెట్‌పై పట్టు సాధించాలేగానీ కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. పెద్దపెద్ద కంపెనీల షేర్లను కొనుగోలు చేసే బదులుగా పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ సమయంలోనే భారీ లాభాలను అందిస్తాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెప్తుంటారు.
(చదవండి: డిగ్రీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ శుభవార్త..!)
Comments
Please login to add a commentAdd a comment