2021 ఏడాదిలో ఎక్కువ శాతం స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల జీవితాలు ఊహించని రీతిలో మారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లలో లాభాలు కురుస్తున్నాయి. కొన్ని కంపెనీల షేర్లు మదుపరుల ఇంట కనక వర్షం కురిపిస్తున్నాయి. ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ స్టాక్ పెట్టుబడిదారులకు గత తొమ్మిది నెలల్లో 5,734 శాతం రిటర్న్‌లను అందించింది. 2021 ఏప్రిల్ 7న రూ.140గా ఉన్న కార్బన్ క్రెడిట్ డెవలపర్ స్టాక్ నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ ఈ)లో రూ.8,168.20కి పెరిగింది.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బిఎస్ఈలో ఈ కంపెనీ రూ.102 వద్ద స్టాక్ ఓపెన్ చేశారు. తొమ్మిది నెలల క్రితం ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ షేర్ల మీద పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయల మొత్తం ఈ రోజు రూ.58.34 లక్షలుగా మారింది. అది కూడా 9 నెలల కాలంలోనే. ఈ కాలంలో సెన్సెక్స్ 2,614 పాయింట్లు(5.26 శాతం) పెరిగింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ.5,614.82 కోట్లుగా ఉంది. ఆరు నెలల్లోనే ఈకేఐ ఎనర్జీ సర్వీసెస్ షేరు 1,134 శాతం లాభపడింది. ఏడుగురు ప్రమోటర్లు సంస్థలో 73.47% వాటాను కలిగి ఉన్నారు. ఇతర వాటాదారులు మిగత 26.53 శాతం వాటాను కలిగి ఉన్నారు.
(చదవండి: ఈపీఎఎఫ్‌ఓ ఖాతాదారులకు అలర్ట్.. ఈ-నామినేషన్‌కు ఇంకా 4 రోజులే గడువు..!)
Comments
Please login to add a commentAdd a comment