హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌తోపాటు చైనాకు చెందిన అల్ట్రా–హై నెట్ వర్త్ వ్యక్తులు (యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) గత సంవత్సరం పెట్టుబడి పెట్టదగిన సంపదలో 6 శాతం బంగారంలో ఉంచారని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. ‘8 శాతం కేటాయింపులతో ఆస్ట్రేలియాకు చెందిన యూహెచ్‌ఎన్‌డబ్ల్యూఐలు తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా సగటు 3 శాతం కాగా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది 4 శాతంగా ఉంది.
పెట్టుబడి పెట్టదగిన సంపదలో బంగారానికి భారతీయులు చేసిన కేటాయింపులు 2018లో 4 శాతం నమోదైంది. సంవత్సరాలుగా పుత్తడి అందించిన గణనీయమైన రాబడి ఈ పెరుగుదలకు కారణం. 2018–19 నుంచి 2022–23 మధ్య పసిడి 69 శాతం కంటే ఎక్కువగా రాబడిని అందించింది. మహమ్మారి తక్కువ వడ్డీ రేటుకు దారితీసింది. అంతర్జాతీయ కేంద్ర బ్యాంకులు అనుసరించిన సులభ నగదు లభ్యత వ్యూహం ధరలను భారీగా పెంచింది’ అని నివేదిక వివరించింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో స్థిరత్వాన్ని అందించే, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనాలను ఆశ్రయిస్తున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment