న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం వేదాంత మాతృసంస్థ వేదాంత రిసోర్సెస్ (వీఆర్‌ఎల్) మరో 400 మిలియన్ డాలర్ల రుణాలను తిరిగి చెల్లించింది. మే, జూన్‌లో మెచ్యూర్ అయ్యే రుణాలు, బాండ్లను మొత్తం చెల్లించేసినట్లు కంపెనీ తెలిపింది. దీంతో స్థూల రుణభారం 6.4 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు వివరించింది.
(ఇదీ చదవండి: సెయిల్ చైర్మన్‌గా ప్రకాష్ బాధ్యతలు స్వీకరణ)
2022 మార్చి నుంచి ఇప్పటివరకు 3.3 బిలియన్ డాలర్లు తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం మిగతా వ్యవధిలో మరిన్ని రుణాలను చెల్లిస్తామని, అంతిమంగా సున్నా స్థాయికి తగ్గించుకుంటామని ఒక ప్రకటనలో వేదాంత తెలిపింది. అయితే, ఇందుకోసం నిర్దిష్ట గడువేదీ వెల్లడించలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2.1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి రానుండగా.. నిధులు సమీకరించేందుకు షేర్లను తనఖా పెట్టడం సహా వీఆర్‌ఎల్‌కు పలు మార్గాలు ఉన్నాయని క్రెడిట్‌సైట్స్ సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment