
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో విజయ డయాగ్నోస్టిక్స్ లాభం స్వల్పంగా పెరిగి రూ. 27.7 కోట్లుగా నమోదైంది. గత క్యూ2లో ఇది రూ. 26.4 కోట్లు. మరోవైపు ఆదాయం రూ. 113.1 కోట్ల నుంచి రూ. 112.1 కోట్లుగా నమోదైంది.
వార్షిక ప్రాతిపదికన కోవిడ్‌యేతర పరీక్షలపరమైన ఆదాయం 22 శాతం పెరగ్గా, కోవిడ్ టెస్టులపరమైన ఆదాయం (ఆర్‌టీ–పీసీఆర్, యాంటీబాండీ పరీక్షలు) 70% క్షీణించినట్లు సంస్థ తెలిపింది. ఇటీవలే ఐపీవోకి వచ్చి న విజయ డయాగ్నోస్టిక్స్.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కొత్తగా 5 సెంటర్స్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సుప్రీతా రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment