న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా దూరపు ప్రయాణాలు చేయలనే అనుకునే వారు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా ఇప్పుడు ఎక్కువ రైళ్లు అందుబాటులో లేవు. మరీ ముఖ్యంగా పండుగ సెలవుల సమయంలో రైల్వే టికెట్ల కోసం ఎన్నో కష్టాలు పడాల్సివస్తుంది. రైల్వే జనరల్ టిక్కెట్స్ కొన్ని నెలల ముందే బుకింగ్ చేసుకోవడం వల్ల ప్రయాణికులు తత్కాల్ టికెట్ బుకింగ్‌లపైనే ఆశలు పెట్టుకుంటారు. ప్రయాణానికి ఒక రోజు ముందు ఏసీ టికెట్ బుకింగ్ కోసం టైమ్ స్లాట్‌ను ఉదయం 10 గంటలుగా నిర్ణయించారు. అదే స్లీపర్ క్లాస్ టికెట్ కోసం అయితే ఉదయం 11 గంటలకు టైమ్ స్లాట్ ఉంటుంది. ఈ టికెట్స్ కూడా చాలా పరిమితంగానే ఉంటాయి. అందుకే వీటికి డిమాండ్ చాలా ఉంటుంది. కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించిన తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవడం కష్టం అవుతుంది. కానీ ప్రయాణికులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం..(చదవండి: కొత్త ఏడాదిలో దూసుకెళ్తున్న బిట్‌కాయిన్)
మాస్టర్ జాబితా: ఇప్పుడు మీరు ఎంత మందికి సంబందించిన టికెట్స్ బుక్ చేయాలనీ అనుకుంటున్నారో వారి వ్యక్తి వివరాలను ముందుగానే మీ ఐఆర్‌సీటీసీ ఖాతాలోని మై ప్రొఫైల్ విభాగంలో సేవ్ చేయండి. దీంతో సమయం ఆదా కావడంతో పాటు కేవలం ఒక్క క్లిక్‌తో మీ పని పూర్తవుతుంది.
పేమెంట్ గేట్‌వే: ఐఆర్‌సీటీసీలో టికెట్ బుకింగ్ చేసే సమయంలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా వేగంగా చెల్లించవచ్చు. కానీ, ఇప్పుడు మీకు ఈ-వాలెట్, పేటీమ్, యూపీఐ యాప్ లలో ఉన్న స్కాన్ ఆప్షన్ ద్వారా చెల్లింపు చేయడం వల్ల కేవలం కొన్ని సెకన్లలో టికెట్ ను బుక్ చేసుకోవచ్చు.
ఇంటర్‌నెట్ స్పీడ్: టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అన్నింటి కంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండటం చాలా ముఖ్యం. టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో వెబ్‌సైట్ లోడ్ కావడానికి చాలా సమయం పడుతుంది. ఇంటర్ నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉండటం కారణంగా బుకింగ్ సమయంలో లోపాలు సంభవిస్తాయి. పేమెంట్ కొన్ని సార్లు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో టిక్కెట్లు బుక్ చేయబడవు.
సిద్ధంగా ఉండటం: మీరు టికెట్ బుక్ చేసుకునే ముందు అందులో తర్వాత రాబోయే స్టెప్స్ గురుంచి మీకు పూర్తి అవగాహనా ఉండాలి. ఒకవేల మీకు అవగాహన లేకపోతే మీ టికెట్ బుకింగ్ సమయం ఎక్కువ కావడం వల్ల మీ బుకింగ్ రద్దు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది.
ముందు లాగిన్ అవ్వడం: తత్కాల్ టికెట్ బుకింగ్ కోటా తెరవడానికి ఒకటి లేదా రెండు నిమిషాల ముందు లాగిన్ అవ్వడం మంచిది. అలాగే స్టేషన్ కోడ్, బెర్త్ ను ముందే ఎంచుకోండి. బుకింగ్ కోటా తెరిచిన వెంటనే మాస్టర్ జాబితా నుండి ప్రయాణీకుల పేర్లను వెంటనే ఎంచుకుని ఆపై నేరుగా పేమెంట్ ఆప్షన్ కు వెళ్ళండి.
బ్యాంక్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం: ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వారు అన్ని బ్యాంక్ వివరాలను పేమెంట్ చేయడం కోసం సిద్ధంగా ఉంచాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఓటీపీ, క్యూఆర్ కోడ్ ఆప్షన్ లలో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఎంచుకోవడం ఉత్తమం. ఓటీపీ కోసం రిజిస్టర్డ్ మొబైల్‌ను మీ దగ్గర ఉంచుకోండి.
ఒకే బ్రౌజర్‌లో లాగిన్ అవ్వండి: మీరు టికెట్ తొందరగా బుకింగ్ చేయడం కోసం ఒకే ఐడితో రెండు వేర్వేరు బ్రౌజర్‌లలో లాగిన్ అవ్వకండి. దీని వల్ల మీ బుకింగ్ రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒక బ్రౌజర్ పనిచేయకపోతే, మీరు మరొక బ్రౌజర్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment