ముంబైకి చెందిన వెబ్‌వెర్క్స్ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సిగ్నల్ ఇచ్చింది. నగరంలో రూ. 500 కోట్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 2022 చివరి నాటికి తొలి దశ పనులు పూర్తి కానున్నాయి. ఇండియా, యూఎస్, యూరప్‌తో పాటు ఏషియా పసిఫిక్ దేశాల్లో 19 డేటా సెంటర్ల ద్వారా వెబ్‌వెర్క్స్ సేవలు అందిస్తోంది.
వెబ్‌వెర్క్స్ సంస్థకి ఇండియాలో ముంబై, ఢిల్లీ, పూనేలలో ఇప్పటికే టైర్ 3 తరహా డేటా సెంటర్లు ఉన్నాయి. కొత్తగా ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అయితే వీటిలో హైదరాబాద్ డేటా సెంటర్ అన్నింటికంటే పెద్దదిగా రూపొందుతోంది. 2026 నాటికల్లా పూర్తి స్థాయిలో హైదరాబాద్ డేటా సెంటర్ రెడీ అవుతుంది.
వరల్డ్ వైడ్‌గా డిజిటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో డేటా సెంటర్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. చెన్నై, ముంబై లాంటి నగరాల్లో ఇప్పటికిప్పుడు పెద్ద ఆర్డర్ వచ్చినా టేకప్ చేయలేని పరిస్థితి ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో అనేక కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment