విప్రో ఉద్యోగులకు శుభవార్త! | Wipro Announces Salary Hike For 80 Percent Employees | Sakshi
Sakshi News home page

విప్రో ఉద్యోగులకు శుభవార్త!

Published Fri, Jun 18 2021 6:40 PM | Last Updated on Fri, Jun 18 2021 10:32 PM

Wipro Announces Salary Hike For 80 Percent Employees - Sakshi

ఐటీ రంగ దిగ్గజం విప్రో లిమిటెడ్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. నేడు (జూన్ 18) తన ఉద్యోగులలో 80 శాతం మంది వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాండ్ బి3(అసిస్టెంట్ మేనేజర్, దిగువ స్థాయి) అర్హులైన ఉద్యోగులందరికీ మెరిట్ వేతన పెంపు(ఎంఎస్ఐ)ను ప్రారంభిస్తుందని, ఇది సెప్టెంబర్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాండ్ ఉద్యోగులు కంపెనీ శ్రామిక శక్తిలో 80 శాతంగా ఉన్నారు. ఈ క్యాలెండర్ లో ఉద్యోగులకు ఇది రెండవ వేతన ఇంక్రిమెంట్. ఈ బ్యాండ్ లలో అర్హులైన ఉద్యోగులకు జనవరి, 2021లో కంపెనీ వేతనాలను పెంచినట్లు ప్రకటించింది.

బ్యాండ్ సీ1(మేనేజర్లు, ఆపైన) అర్హులైన ఉద్యోగులందరూ జూన్ 1 నుంచి పెంచిన వేతనాలను అందుకోనున్నట్లు విప్రో ప్రకటించింది. విప్రో ప్రధాన పోటీదారు టీసీఎస్ మొదట ఈ ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 1, 2021న వేతన పెంపును ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement