ప్రపంచ ఎకానమీ మొదటిసారిగా వచ్చే ఏడాది 2022లో 100 ట్రిలియన్ డాలర్లను మించిపోనుంది. ప్రపంచంలోనే నెం.1 ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భావించిన చైనా ఆశలు అది ఆశలు అయ్యాయి. వచ్చే ఏడాది కూడా ఆర్థిక వ్యవస్థ పరంగా యునైటెడ్ స్టేట్స్(యుఎస్) ఆఫ్ అమెరికానే మొదటి స్థానంలో నిలవనుంది. ప్రపంచంలో నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారడానికి చైనాకు కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఒక నివేదిక వెల్లడించింది. బ్రిటిష్ కన్సల్టెన్సీ సెబ్ర్ చైనా 2030లో డాలర్ పరంగా ప్రపంచంలోని అగ్ర ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది.
ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఫ్రాన్స్‌ను వచ్చే ఏడాదిలోనూ, 2023లో యుకెను భారతదేశం అధిగమించనున్నట్లు సెబ్ర్(CEBR) నివేదిక తెలిపింది. "2020 తర్వాత ప్రపంచాన్ని ప్రస్తుతం వేదిస్తున్న ప్రధాన సమస్య ద్రవ్యోల్పణం. అది ఇప్పుడు అమెరికాలో 6.8% కు చేరుకుంది" అని సెబ్ర్ డిప్యూటీ చైర్మన్ డగ్లస్ మెక్ విలియమ్స్ అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2023 లేదా 2024లో ఆర్థిక మాంద్యం తప్పదు అని అన్నారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ను జర్మనీ 2033లో అధిగమించే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. రష్యా 2034 నాటికి టాప్ 10 జాబితాలో చేరే అవకాశం ఉంది ఈ నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment