రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
● మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు
● ఆర్టీసీ బస్సు ఢీ కొని మరొకరు
● ఒకరికి తీవ్ర గాయాలు
వడమాలపేట (విజయపురం): మోటార్ సైకిళ్లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి వడమాలపేట మండలం కదిరిమంగళం క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ ధర్మారెడ్డి కథనం.. ఎస్‌వీ పురానికి చెందిన మేసీ్త్ర పనిచేసే సుధాకర్ (52 తిరుపతిలో పని ముగించుకొని ద్విచక్రవాహనంపై తిరిగి ఇంటికి వస్తూ మృత్యువాత పడ్డాడు. తమిళనాడుకు చెందిన హర్ష (25) చైన్నె నుంచి ద్విచక్రవాహనంపై తిరుపతికి వస్తూ పరస్పరం కదిరిమంగళం క్రాస్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన హర్షను తిరుపతికి తరలించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీరంగరాజపురం మండలంలో..
శ్రీరంగరాజపురం: ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన 49 కొత్తపల్లి మిట్ట సమీపంలోని సీఎస్‌ఐ చర్చి వద్ధ చిత్తూరు–పుత్తూరు జాతీయ రహదారిపై గరువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం...మండలంలోని కటికపల్లెకు చెందిన తిరుమలేశం(42) తన సొంత పనుల నిమిత్తం బైక్‌లో బంగారుపాళ్యం వెళ్లి తిరుగు ప్రయాణంలో 49 కొత్తపల్లిమిట్ట సమీపంలోని సీఎస్‌ఐ చర్చి వద్ధ తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు చోరీ
పుంగనూరు : చిన్నతాండలో ఇంటి వద్ద పెట్టిన కారును దొంగలు చోరీ చేసిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బెరుకలానాయక్ తనకు తెలిసిన షబినా అనే మహిళకు చెందిన కారును రాత్రి తన ఇంటి ఆవరణలో పెట్టి నిద్రించాడు. గురువారం ఉదయం లేచి చూసే సరికి కారు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. కారు టోల్‌గేట్ దాటి వెళ్లడాన్ని గుర్తించి అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment