కన్నబిడ్డ కోసం తల్లి దీక్ష
పుంగనూరు : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త .. కుమారైను చెప్పకుండా ఇంటినుంచి తీసికెళ్లి ఇద్దరూ ఎక్కడున్నారో తెలియకపోవడంతో భార్య ఆందోళన చెందుతూ మరో కుమారైతో కలసి నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన గురువారం అంబేడ్కర్ సర్కిల్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ప్రభు, ఉషశ్రీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. ఇలా ఉండగా చెడు అలవాట్లకు బానిసైన ప్రభు, ఉషశ్రీని వేధించడం చేసేవాడు. ఈ క్రమంలో భర్త వేధింపులు తాళలేక ఉషశ్రీ బిడ్డలను తీసుకుని నాయుడుపేటకు వెళ్లిపోయింది. ఆ సమయంలో భర్త ప్రభు భార్య ఇంటికి వెళ్లి పెద్ద కుమారైకు సైకిల్ తీసి ఇస్తానని మాయమాటలు చెప్పి తీసికెళ్లి ఇంటికి వెళ్లకుండా వెళ్లిపోవడంతో పాప, భర్త ఆచూకీ కోసం ఉషశ్రీ ఎంత గాలించిన ఫలితం లేకపోయింది. భర్త , కుటుంబ సభ్యులు పుంగనూరులో ప్రభును దాచిపెట్టారని నిరసిస్తూ దీక్షకు దిగింది. తన బిడ్డ ఆచూకీని కనుగొనాలని, భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దళిత సంఘాలు ఆమెకు మద్దతు పలికాయి. ఈ మేరకు తహసీల్దార్, పోలీసులకు వినతిపత్రం సమర్పించింది. సీఐ శ్రీనివాసులు చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment