విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న టెంపో
వి.కోట : పట్టణంలోని బాలికల వసతి గృహం సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఓ టెంపో గురువారం అర్ధరాత్రి ఢీకొంది. దీంతో పట్టణంలో గురువారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి పట్టణం అంతా అంధకారం నెలకొంది. టెంపో డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వెళుతూ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఆ తీవ్రతకు స్తంభం విరిగి శాంతిపురం నుంచి వి.కోట సబ్ స్టేషన్‌కు సరఫరా అయ్యే లైన్ తెగిపోయింది. శుక్రవారం ఉదయం ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ స్తంభాన్ని మార్చి సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment