చిత్తూరు అర్బన్ : మద్యం తాగి వాహనాలు నడపడం, ఇతర కేసుల్లో ఏడుగురికి రూ.33,050 జరిమానా విధించినట్లు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. శనివారం చిత్తూరు పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా.. ముగ్గురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడపటం, మరో ముగ్గురు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం , మరో వ్యక్తి , స్థానికులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడంతో వీళ్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు. నిందితులు ఏడుగురికి జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిందన్నారు.
ముగిసిన టీచర్ల సీనియారిటీ జాబితా కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్ల సీనియారిటీ జాబితా ప్రక్రియ విద్యాశాఖ అధికారులు నెల రోజులుగా కుస్తీపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ టీచర్ల సీనియారిటీ జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాలను పకడ్బందీగా ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ప్రక్రియ శనివారంతో ముగిసిందని డీఈఓ వరలక్ష్మి వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని స్కూల్ అసిస్టెంట్‌లు 7,534, ఎస్జీటీలు 6,443, హెచ్‌ఎంలు 408 సీనియారిటీ జాబితా ఆన్‌లైన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసినట్లు డీఈఓ తెలిపారు.
ఉద్యోగమేళాను
సద్వినియోగం చేసుకోండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మైనారిటీ అభ్యర్థులు ఉద్యోగమేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ కార్పొరేషన్ ఈడీ హరినాథరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (సీడాప్) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తారన్నారు. ఈ నెల 28, మార్చి 4, 14, 18, 28 తేదీల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ ఉద్యోగ మేళాలను జిల్లాలోని మైనారిటీ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 98499 01139 నంబర్‌లో సంప్రదించాలని ఈడీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment