అధికారుల గైర్హాజరుపై నిలదీత
● హాజరు కాని అధికారులకు షోకాజ్‌లు ● కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్న జెడ్పీ ఛైర్మన్ ● రూ.3,996 కోట్లతో ప్రతిపాదిత బడ్జెట్ ● జెడ్పీ స్టాండింగ్ కమిటీలో నిప్పులు చెరిగిన సభ్యులు
చిత్తూరు కార్పొరేషన్ : ప్రభుత్వ జీతం, అలవెన్సులు తీసుకుంటూ ప్రజా సమస్యలపై చర్చించే జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరంగా పలువురు అధికారులు రావడం లేదని జెడ్పీటీసీలు మండిపడ్డారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులను ఏకిపారేశారు. పలు శాఖల హెచ్‌ఓడీలు రాకుండా కింద స్థాయి అధికారులు వస్తే లాభమేమిటని నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పిన తీరు మారడం లేదని మార్చిలో జరిగే సర్వసభ్య సమావేశానికి మూడు జిల్లాల అధికారులు రాకపోతే జెడ్పీటీసీలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. దీనిపై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఆగ్రహించారు. దీనిపై మూడు జిల్లాల కలెక్టర్లకు ఫిర్యాదు చేసి షోకాజ్ నోటీసు ఇవ్వడానికి ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్లు ధనంజయరెడ్డి, రమ్య, స్టాండింగ్ కమిటీ చైర్మన్ భారతి, డిప్యూటీ సీఈఓ జుబేదా, జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతిపాదిత బడ్జెట్‌కు ఆమోదం
ఉమ్మడి జిల్లా జెడ్పీ ప్రతిపాదిత బడ్జెట్ (11 శాఖలు) రూ.3,996 కోట్లను సీఈఓ రవికుమార్‌నాయుడు ప్రవేశపెట్టారు. 2024–25 ఆదాయం రూ.3,296 కోట్లు, వ్యయం రూ.2,634 కోట్లని తెలిపారు. కాగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదిత ఆదాయం రూ.3,996, వ్యయం రూ.3,888 కోట్లు అని ప్రకటించారు. జెడ్పీ, పీఆర్, విద్య, వైద్య, సీ్త్ర శిశు సంక్షేమం, డీఆర్‌డీఏ, వ్యవసాయం, పశుసంవర్థకం, మత్స్యపరిశ్రమ, వెల్ఫేర్, డ్వామా శాఖల పరంగా ఆదాయ, వ్యయాలను తెలియజేయగా సభ్యులు ఆమోదించారు. వేర్వేరుగా కాకుండా సంతలాగా అన్ని సమావేశాలు కలిపి పెట్టేశారు. ఉదయం 10.40 గంటలకు సమావేశం ప్రారంభించి మధ్యాహ్నం 1.30 గంటలకు ముగించారు.
ప్రజాప్రతినిధుల తీర్మానాలకు విలువలేదా?
ప్రజాప్రతినిధులంటే అధికారులకు లెక్కలేకుండా పోయిందని నారాయణవనం జెడ్పీటీసీ సుమన్ ఆ గ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి డ్వామా పీడీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామసభ లో తీర్మానం చేసిన పనులను చేయడం లేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పేరుకే తప్ప క్షేత్రస్థాయిలో ఆశించిన విధంగా అభివృద్ధి పనులు జరగడం లేదని ఎర్రవారిపాలెం జెడ్పీటీసీ కరుణాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ నిధులతో పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. జెడ్పీటీసీలకు గౌరవ వేతనం ఇ వ్వడం లేదని రామకుప్పం జెడ్పీటీసీ నితిన్ అసహ నం వ్యక్తం చేశారు. సభ్యులు కానీవారు సమావేశాని కి ఎందుకు వస్తున్నారని, ఇది ప్రభుత్వ సమావేశమా లేదా పర్సనల్ ఫంక్షనా అని కుప్పం జెడ్పీటీసీ శరవ ణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కుప్పంలోనే ఉపాధ్యాయుల పనితీరు నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. విధులకు ఆలస్యంగా వ చ్చి తొందరగా వెళ్లిపోతున్నారన్నారు. వీరు బెంగళూరులో స్థిరపడటమే ఇందుకు కారణమన్నారు. కు ప్పం నియోజకవర్గంలో 100 మంది ఉపాధ్యాయులు ఇలా రాకపోకలు సాగిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. బోధన కంటే రియల్ ఎస్టేట్‌పైనే వీరికి మ క్కువ అని విమర్శించారు. హౌసింగ్ అధికారుల వద్ద ఎప్పుడు సమాచారం ఉండదని ఏర్పేడు జెడ్పీటీసీ తి రుమల్లయ్య ఎద్దేవా చేశారు. పలువురు జెడ్పీటీసీలు మాట్లాడుతూ.. విద్యాశాఖలో దీర్ఘకాలంగా ఉన్న ఉ ద్యోగులను, ఉపాధ్యాయులను బదిలీ చేయాలన్నా రు. గుండె రంధ్రాలు బ్లాక్ అయినప్పుడు ఉపయోగించే రూ.45 వేలు విలువ చేసే స్టెమి ఇంజెక్షన్‌ను ప్రభుత్వ ఆస్పత్రి లో అందుబాటులో ఉంచామని వైద్యాధికారులు వివరించారు.
అధికారుల గైర్హాజరుపై నిలదీత
Comments
Please login to add a commentAdd a comment