ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

Published Sun, Feb 23 2025 1:49 AM | Last Updated on Sun, Feb 23 2025 1:44 AM

ప్రతి

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

విభిన్న ప్రతిభావంతులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

సకల దేవతలకు ఆహ్వానం

శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

పలమనేరు : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా టమోటాను రైతులు సాగు చేస్తారు. దీనికి ఎప్పుడు ధరలుంటాయో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్త రకాల పంటల వైపు చూసేలా చేస్తున్నాయి. పలమనేరు నియోజకవర్గంలోని వీకోటకు 10 కిలోమీటర్ల దూరంలో కమ్మసంద్ర గ్రామంలో రైతు బసవరాజు ప్రయోగాత్మకంగా ఒక ఎకరా పొలంలో ఆపిల్‌ను సాగు చేసి అధిక దిగుబడులు సాధించి పలువురు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆపిల్‌ పంటను ఇప్పటికే చిక్‌బళ్లాపూర్‌ సమీపంలోని పారేసంద్రలో రైతు నారాయణస్వామి, వాయల్పాడు సమీపంలోని అయ్యవారిపల్లిలో రైతు శివశంకర్‌రెడ్డి ఇప్పటికే ఆపిల్‌ పంటను సాగు చేస్తున్నారు. ఇక్కడి శీతల వాతావరణం కారణంగా ఆపిల్‌ సాగుకు అనుకూలమైందని ఆ రైతులు చెబుతున్నారు. ఇక లోకల్‌ ఊటీగా పిలవబడే పలమనేరు ప్రాంతంలో వేసవి కాలంలోనూ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు దాటవు. భవిష్యత్తులో ఇక్కడ ఆపిల్‌ సాగు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి దాకా సిమ్లా, డార్జిలింగ్‌, కశ్మీర్‌లో సాగయ్యే ఆపిల్‌ పంట ఇక మనం కూడా సాగు చేయబోతున్నాం.

వీకోట సమీపంలోని కమ్మసంద్రకు చెందిన బసవరాజు, ముళబాగి సమీపంలోని నారాయణ స్వామి తమ పొలాల్లో ఎకరా చొప్పున ఆపిల్‌ను గతేడాది సాగు చేశారు. బెంగళూరుకు చెందిన చక్రపాణి పారేసంద్ర, ధర్మవరంలో ఆపిల్‌ నర్సరీని పెట్టి రైతులకు మొక్కలను విక్రయిస్తున్నారు. ఇతను ఆపిల్‌ సాగుపై హిమాచల్‌ ప్రదేశ్‌లో పరిశీలన చేసి అక్కడే గ్రాఫ్టింగ్‌ చేసి మొక్కలను ఇక్కడికి తెచ్చి తన నర్సరీలో ఆరు నెలలు పెంచి ఆపై రైతులకు మొక్క రూ.200గా విక్రయిస్తున్నాడు. దీంతో రైతులు వారి పొలంలో అన్నా, హెచ్‌ఆర్‌ఎమ్‌ఎన్‌ 99, డోర్‌సెట్‌ గోల్డెన్‌ అనే రకాల ఆపిల్‌ను ఎకరాకు 440 మొక్కల చొప్పున గతేడాది నాటారు. మొక్కల మధ్య పొడవు పది, వెడల్పు పది అడుగుల దూరం విడిచిపెట్టారు. ఇవి ఎక్కువగా ఎర్రమట్టి నేలల్లోనే పండుతున్నాయి. నాటిన రెండేళ్ల నుంచి కాతకొస్తున్నాయి. చెట్టుకు 30 కాయల సగటున కాసినట్లు రైతులు తెలిపారు. కాయబరువు 200 గ్రాముల దాకా ఉంటుందని, ఎకరానికి 12 వేల కాయలు కాస్తున్నట్లు చెబుతున్నారు. కాయ ధర రూ.20 అనుకున్నా కోతకు రూ.2.40 లక్షల ఆదాయం ఈ పంటలో దక్కుతోంది.

ఆపిల్‌ పండే ప్రాంతాల్లో లాగా ఇక్కడ ఆపిల్‌ మంచి రుచి, రంగు రావాలంటే అన్నా రకంతో పాటు ప్రతి పది మొక్కల మధ్య రెండేసి హెచ్‌ఆర్‌ఎంఎన్‌ 99, డోర్‌సెట్‌ గోల్డ్‌ మొక్కలు నాటుకోవాలి. ఇవి ఉంటేనే ఆపిల్‌ పంట వస్తుందని నర్సరీ వారు చెబుతున్నారు. ఇవి కోతకొచ్చేముందు పచ్చగా ఉంటూ, ఆపై పసుప రంగులోకి మారి కాయ పక్వానికొచ్చి కోత కొచ్చేసరికి ఎరుపురంగులోకి వస్తుందని తెలిపారు.

కమ్మసంద్రలోని రైతు బసవరాజు ఆపిల్‌ తోట

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

సస్యరక్షణ తక్కువే

ప్రయోగాత్మకంగా సాగు

అధిక దిగుబడులు

తక్కువ ఖర్చుతో గ్యారెంటీ ఆదాయం

కూలీల బాధ, చీడపీడలు దూరం

అనుకూలమైన వాతావరణం

మూడు రకాల మొక్కలను నాటితే...

రెండేళ్లలోనే దిగుబడులు

భలే రుచి ..

ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న ఆపిల్‌ ఎర్రటి రంగులో రుచికరంగా ఉంటున్నాయి. మనం మార్కెట్‌లో కొనే ఆపిల్స్‌ గట్టిగా మారి లోన పిండిగా ఉంటుంది. అక్కడ ఆపిల్‌ను కోసి కోల్డ్‌ స్టోరేజ్‌లో రసాయనాలతో నిల్వ బెట్టి ఆపై విక్రయాలు చేయడం కారణంగా కాయలోని గుజ్జు పిండిగా మారిపోతుందని, పోషకాలు ఉండవని స్థానిక రైతు చెబుతున్నారు. కాని ఇక్కడ సాగు చేసే ఆపిల్‌ చాలా బాగుంటుందని ఇప్పటికే సాగు చేసిన రైతులు తెలిపారు.

ఏదైనా ప్రయత్నం చేయకుండా ఫలితం రాదనేది అందరికీ తెలిసిన సత్యమే.. ఈ సాధనలో ఎన్నో ఒడుదొడుకులు వచ్చినా తట్టుకొని నిలబడినప్పుడే విజయం సొంతం అవుతుందని ఓ రైతు గట్టిగా నమ్మాడు.. అందుకు తగ్గట్లు ఏటా సాగు చేసే టమాటా జూదంలో ఓడిపోయాడు.. కానీ తెలివిగా ప్రయత్నం చేసి పోయిన డబ్బులను దక్కించుకోవాలని పట్టుదలతో ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా పలమనేరు మండలం కమ్మసంద్రలో ఆపిల్‌ పంటను సాగు చేసి అధిక దిగుబడులతో టమాటలో పోయిన డబ్బులను ఆపిల్‌ పంటలో సాధించి మిగిలిన రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

రెండు కోతల్లోనే ఆదాయం

నేను రెండేళ్ల కిందట ఎకరా పొలంలో ఆపిల్‌ పంటను సాగు చేశా. పంట బాగా వచ్చింది. కలర్‌, రుచి చాలా బాగుంది. ఎకరాకు లక్ష ఖర్చు చేశా. రెండు కోతల్లోనే నేను పెట్టిన పెట్టుబడి వచ్చింది. తోటను బాగా చూసుకుంటే వచ్చేది అంతా లాభమే. ముందు టమాటా సాగు చేసి చాలా నష్టపోయా అందుకే కొత్తగా ఏదైనా చేయాలని ఆపిల్‌ను సాగు చేశా.

– బసవరాజు, కమ్మసంద్ర,

వీకోట సమీప గ్రామం

అవసరమైన రైతులకు మొక్కలు ఇస్తున్నాం

నేను ఆపిల్‌ సాగుపై పరిశీలనలు చేసి మన ప్రాంతంలో తప్పకుండా ఆపిల్‌ సాగు చేయవచ్చునని నమ్మి ఇక్కడి రైతులకు ఇచ్చా. సుమారు పది మంది దాకా కర్ణాటక, ఆంధ్రాలో రైతులు ఇప్పుడు ఆపిల్‌ను సాగు చేస్తున్నారు. పంట దిగుబడులు బాగున్నాయి. అవసరమైన రైతులకు మొక్కలను ఇచ్చి పంట ఎలా సాగు చేయాలో సలహాలు ఇస్తున్నాం.

– చక్రపాణి, ఆపిల్‌ నర్సరీ నిర్వాహకుడు

పరిశీలిస్తున్నాం..

గతంలో హార్సిలీహిల్స్‌ లో ప్రయోగాత్మకంగా ఆపిల్‌ మొక్కలను సాగు చేశాం. కాని అనుకున్న ఫ లితం దక్కలేదు. కానీ ఇ ప్పుడు మన వీకోట సమీపంలోనే ఆపిల్‌ సాగవుతున్నందున ఆ పంటను గమనించి రైతుతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఆపిల్‌ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం.

– డా.కోటేశ్వర్‌రావు, హార్టికల్చర్‌ ఏడీ, కుప్పం

అన్ని పంటల లాగా ఈ పంటకు కూలీలతో పెద్దగా పని ఉండదు. ఆపిల్‌ నాటే ముందు పాదుల్లో దిబ్బెరువు, ఆపై మొక్క పెరిగే సమయంలో వేపనూనె, ఫంగిసైడ్స్‌, డ్రిప్పులో మైక్రో న్యూట్రియన్స్‌ వేసుకుంటే చాలు. ఈ పంటకు పెద్దగా తెగుళ్ల సమస్య ఉండదని రైతులు చెబుతున్నారు. ఓ సారి పంట సాగు చేస్తే ఆపై పదేళ్ల దాకా కోతలుంటాయి. కాబట్టి ఇక్కడి రైతులు భారీ పెట్టుబడులు పెట్టి టమాటా లాంటి పంటలకు బదులు ఆపిల్‌ సాగు చేసుకుంటే నికర లాభాలను సాధించే అవకాశం ఉంది.

సాగుకు ఇప్పుడే సమయం..

ఆసక్తి ఉన్న రైతులు ఆపిల్‌ సాగుకు ఇప్పుడే సమయమని నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి తెప్పించిన గ్రాఫ్టింగ్‌ మొక్కలు నవంబరు నుంచి నర్సరీలో పెంచి ఫిబ్రవరిలో విక్రయిస్తున్నారు. ఇప్పుడు నాటిన మొక్కలు అనంతపురం జిల్లాలోని ధర్మవరం, కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో వేసవిలో ఉష్ణోగ్రత 39 డిగ్రీల దాకా ఉన్నప్పటికీ ఆపిల్‌ బాగా సాగువుతున్నందున పలమనేరు, కుప్పం, పుంగనూరు, బి.కొత్తకోట, మదనపల్లి ప్రాంతాల్లో ఆపిల్‌ సాగు బాగుంటుందని నిర్వాహకులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
1
1/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
2
2/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
3
3/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
4
4/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
5
5/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
6
6/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
7
7/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
8
8/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
9
9/9

ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement