ప్రభుత్వ స్థలం దురాక్రమణ నిజమే
చౌడేపల్లె: కాటిపేరి గ్రామంలో ప్రభుత్వ స్థలం ఆక్రమించుకుని పశువుల షెడ్డు ఏర్పాటు చేసిన విషయం నిజమేనని మంగళవారం డివి జినల్ సర్వేయర్ కృష్ణమూర్తి నిర్థారించారు. ఇటీవల అదే గ్రామానికి చెందిన కుమార్‌రెడ్డి ఆక్రమణపై గ్రీన్‌వెన్స్‌డేలో ఫిర్యాధు చేశారని తెలిపారు. అధికారులు సక్రమంగా విచారణ చేపట్టకుండా ఫిర్యాదును క్లోజ్ చేయడంతో తిరిగి జిల్లా సర్వేయర్‌ను కుమార్‌రెడ్డి ఆశ్రయించగా డివిజినల్ సర్వేయర్ మంగళవారం సర్వే చేశారు. ఈ స్థలం బండిబాటగా రికార్డుల్లో ఉందని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయమైన ఆర్డీఓకు ఎండార్స్‌మెంట్ చేస్తూ ఆక్రమిత స్థలాన్ని స్వాఽధీనం చేసుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment