కుప్పంలోఉపాధి కల్పనకు కృషి
కుప్పం: నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పనకు కృషి చేస్తున్నట్లు కడా పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. మంగళవారం కడా కార్యాలయ ప్రాంగణంలో 1ఎమ్, 1బి జాబ్ మేళాను నిర్వహించారు. నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వివిధ కంపెనీల్లో ఖాళీగా ఉన్న 700 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. భారీగా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, ఎంపిక కాని వారికి కూడా త్వరలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో 1ఎమ్,1బి సభ్యులు, ఆర్టీసీ వైస్ చైర్మన్ పి.ఎస్.మునిరత్నం, డా.సురేష్‌బాబు, టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆటోడ్రైవర్‌కు మూడేళ్ల జైలు
చిత్తూరు అర్బన్: పోక్సో కేసులో నిందితుడైన ఆటోడ్రైవర్‌కు మూడేళ్లు జైలుశిక్ష విధిస్తూ మంగళవారం స్థానిక జిల్లా ఫోక్సో కోర్టు న్యాయమూర్తి శాంతి తీర్పు చెప్పారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. బంగారుపాళెం మండలం గుండ్లకట్టమంచికి చెందిన ధనరాజ్(45) చిత్తూరు, బంగారుపాళెం పరిసర ప్రాంతాల్లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చిత్తూరు నగరానికి చెందిన 17 ఏళ్ల బాలిక స్థానికంగా ఓ పార్కు వద్ద ఉండగా ఆటోడ్రైవర్ ధనరాజ్ 2020 అక్టోబర్ 15వ తేదీన బాలికతో అసభ్యకరంగా వ్యవహరించాడు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. పూర్వపరాలను పరిశీలించిన తరువాత నేరం రుజువుకావడంతో నిందితుడికి మూడేళ్ల మూడు నెలలు జైలుశిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కుప్పంలోఉపాధి కల్పనకు కృషి
Comments
Please login to add a commentAdd a comment