
కబ్జాలు.. కిడ్నాప్‌లు
వ్యవస్థాపక విద్యకు ప్రాధాన్యం
జిల్లాస్థాయి నుంచే వ్యవస్థాపక విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జిల్లా నోడల్ అధికారి అరుణ్‌కుమార్ అన్నారు.
రెచ్చిపోతున్న కూటమి నేతలు
● యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా ● ప్రశ్నిస్తే దాడులు.. దౌర్జన్యాలు ● ‘భూ’చోళ్లకు సహకరిస్తున్న అధికారులు ● కిడ్నాప్‌లకు సైతం తెగబడుతున్న పచ్చమూక ● వైన్‌షాపు యజమానులకు బెదిరింపులు ● ఇష్టారాజ్యంగా మద్యం దందా
13 నెలలు జీతాలివ్వకపోతే ఎలా?
ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు 13 నెలలుగా జీతాలివ్వకపోతే ఎలా అని సీఐటీ యూ నేత గంగరాజు ప్రశ్నించారు.
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కబ్జాలు.. దాడులు.. దౌర్జన్యాలు.. కిడ్నాప్‌లు.. బెదిరింపులతో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు. అక్రమార్జనే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. ఖాళీగా కనిపించిన ప్రభుత్వ భూములను ఆక్రమించేస్తున్నారు. వివాదాస్పద స్థలాల విషయంలో పెద్దమనుషులుగా అవతారమెత్తి అసలుకే ఎసరు పెట్టేస్తున్నారు. అప్పు వసూలు పేరుతో రౌడీయిజం చేస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులందరూ ప్రత్యేక బృందంగా తయారై అందిన కాడికి దోచేసుకుంటున్నారు. మామూళ్లతో అధికారుల కళ్లకు గంతలు కట్టేస్తున్నారు.
రంగంలోకి ఐదుగురు
ఇటీవల తిరుపతికి చెందిన ఓ కుటుంబాన్ని కూటమి పార్టీలకు చెందిన గూండాలు కిడ్నాప్ చేసిన విషయం తెలిసింది. చేసిన అప్పు తిరిగి ఇవ్వలేదని అందరినీ ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఉదంతంపై సంబంధిత అధికారులు ‘మమ’ అనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతి నగర పరిధిలో వివాదాస్పద భూముల విషయంలో ప్రధానంగా టీడీపీ, జనసేనకు చెందిన ఐదుగురు వ్యక్తులు రంగంలోకి దిగారు. విలువైన స్థలాను ఆక్రమించుకుని పాగా వేస్తున్నారు. అందులో భాగంగా దామినేడు, తిమ్మినాయుడుపాళెం, తిరుపతి అర్బన్ పరిధిలోని దూరదర్శనం కేంద్రం ముందు వెనుక ఉన్న ఫుట్‌పాత్, ఆర్టీసీ బస్టాప్‌కు కేటాయించిన రూ.కోట్లు విలువైన స్థలాలను కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఈ ఆక్రమణలపై రెండు రోజుల క్రితం సాక్షిలో ‘భూ చోళ్లు’ అనే శీర్షికతో వెలుగులోకి తీసుకువచ్చినా అధికారుల నుంచి స్పందన లేదు.
రేణిగుంట మండలం కుర్రకాల్వ వద్ద రియల్ వెంచర్ వేస్తున్న అక్రమార్కులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి గూండాల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. మధ్యస్తం పేరుతో వివాదాస్పద భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించుకుంటున్నారు. మద్యం దుకాణాల్లో దందాలు, వ్యాపారుల కిడ్నాప్‌లతో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడంపై జనం మండిపడుతున్నా రు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయా పార్టీల నేతలు అన్ని వర్గాల వారిని వేధిస్తున్నారు.
మద్యం డీలర్లతో ఒప్పందం?
చిత్తూరు నియోజక వర్గ పరిధిలోని షాడో ఎమ్మెల్యే పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రధానంగా మద్యం దుకాణాల యజమానులను తన కనుసన్నల్లోకి తెచ్చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం డీలర్లతో కూడా ఇప్పటికే ఓ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. డిమాండ్ లేని బ్రాండ్లను అమ్మిస్తామని భరోసా ఇచ్చి కమీషన్ కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఒక పర్యాయం మద్యం డీలర్లతో చర్చలు సాగించినట్లు వైన్‌షాపు యజమానులు ఆరోపిస్తున్నారు. అమ్ముడుపోని బ్రాండ్లను తమకు అంటగట్టి వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జగన్‌మోహన్ పేరు చెప్పి సదరు షాడో ఎమ్మెల్యే బెదిరింపులకు దిగుతున్నట్లు వాపోతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించడపోవడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మద్యం డీలర్ల నుంచి కమీషన్లు రాబట్టుకునేందుకు షాడో ఎమ్మెల్యే మరో పర్యాయం సమావేశం కాన్నుట్లు సమాచారం.
– 8లో
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్
రేణిగుంట మండలం కుర్రకాల్వ పరిధిలో సర్వే నంబర్ 18/1బి 4.21 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.కోట్లలో ఉంది. ఈ భూమికి పై భాగంలో చెరువు నిండితే కలుజు ద్వారా నీరు కిందికి ప్రవహిస్తుంది. రేణిగుంట–పాపానాయుడుపేట మార్గంలోని ఈ విలువైన భూమిపై టీడీపీ నేతల కన్నుపడింది. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే ఆ పార్టీ నేతలు రంగంలోకి దిగారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పేరు చెప్పి ఏర్పేడు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి సహకారంతో ఈ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. స్థానికులు అడ్డుకుంటే.. ఈ భూమిని 20 ఏళ్ల క్రితమే తాము కొనుగోలు చేసుకున్నామని, ఫ్రీహోల్డ్‌లో రిజిస్ట్రేషన్ కూడా అయ్యిందని సదరు కబ్జాదారులు ఎదురు దాడికి దిగారు. దీనిపై స్థానికులు వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే తిరుపతి అర్బన్ మండలం అక్కారాంపల్లె సర్వే నంబర్ 112/11లో 273 అంకణాల ప్రభుత్వ భూమిని జనసేన నేతలు ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. సుబ్బారెడ్డి నగర్‌లో నివాసాలకు మధ్యలో ఉన్న రూ.కోట్లు విలువైన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

కబ్జాలు.. కిడ్నాప్‌లు

కబ్జాలు.. కిడ్నాప్‌లు

కబ్జాలు.. కిడ్నాప్‌లు

కబ్జాలు.. కిడ్నాప్‌లు

కబ్జాలు.. కిడ్నాప్‌లు

కబ్జాలు.. కిడ్నాప్‌లు

కబ్జాలు.. కిడ్నాప్‌లు