చిత్తూరు కలెక్టరేట్ : ద్విచక్రవాహనాల పార్కింగ్ కోసం కలెక్టరేట్‌లో పార్కింగ్ షెడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ద్విచక్రవాహనాల పార్కింగ్‌కు షెడ్ లేకపోవడంతో ఎండలోనే వాహనాలను పార్క్ చేసేవారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ చొరవతో వాహనాలను నిలుపుకునేందుకు అనువుగా రెండు షెడ్లను నిర్మించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ షెడ్ల పనులు తుది దశకు చేరుకున్నాయి.
బావిలో పడిన జింక
ఐరాల: దాహంతో దారి తప్పి మామిడి తోటలోకి వచ్చిన జింక శుక్రవారం వ్యవసాయ బావిలో పడింది. మండలంలోని గోవిందరెడ్డిపల్లె సమీపంలోని రైతు రంజిత్‌రెడ్డి మామిడి తోటలోకి ఓ జింక వచ్చి బావిలో పడిపోయింది. అటుగా పొలాలకు వెళుతున్న స్థానిక రైతులు గమనించి అటవీ శాఖాధికారులకు సమాచారమిచ్చారు. డీఆర్‌ఓ రాకేష్‌కుమార్ నేతృత్వంలో సిబ్బంది బావిలోకి దిగి జింకను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కొంత సమయానికి జింక అటవీ ప్రాంతం వైపు పరుగులు పెట్టింది.
పరిశోధనలతోనే గుర్తింపు
నారాయణవనం: వృత్తి విద్యను అభ్యసిస్తున్న యువ ఇంజినీర్లు వినూత్న పరిశోధనలతోనే గుర్తింపు పొందుతారని పలువురు పేర్కొన్నారు. స్థానిక పుత్తూరు సిద్ధార్థ కళాశాలలో శుక్రవారం నేషనల్ లెవల్ టెక్నికల్ సింపోజియంను నిర్వహించారు. పలు ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 1,200 మంది యువ ఇంజినీర్లు 400 పరిశోధనాత్మక పత్రాలను సమర్పించారు. బెంగళూరుకు చెందిన ఇన్‌ఫోసిస్ అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్ గ్రూప్‌కు చెందిన చీఫ్ ఇంజినీర్ జోహర్ సింగ్, తిరుపతికి చెందిన ఇండో ఎంఐఎం లిమిటెడ్ హెచ్‌ఆర్ కిరణ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక పరిశోధనలతో నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, జనార్దనరాజు మాట్లాడుతూ టెక్నికల్ ఇన్‌ఫోయిజంలను వేదికగా చేసుకుని యువ ఇంజినీర్లు తమ సాంకేతిక పరిజ్ఞాన్ని పెంచుకోవాలని తెలిపారు. పవర్ పాయింట్, పేపర్ ప్రజెంటేషన్‌లో మొదటి ముగ్గురు విజేతలకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లతోపాటు నగదు బహుమతిని అందజేశారు. వివిద ఇంజినీరింగ్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో పార్కింగ్ షెడ్